పది మందికి తీవ్ర గాయాలు
పోలీసుల సమక్షంలోనే వేదిక ధ్యంసం
బెంగాల్లోని బిజెపి ప్రభుత్వం... ప్రతిపక్షాలపై దాడులను కొనసాగిస్తుంది. తాజాగా శుక్రవారం నాడు బిపణి మోర్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం నిర్వహిస్తున్న బహిరంగ సభపై బిజెపి గూండాలు దాడి చేసి సిపిఎం కార్యకర్తల తలలు పగలగొట్టారు. ఈ కార్యక్రమంలో వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు, వేదికపై ఉన్న సామగ్రిని పగలగొట్టి విసిరేశారు. అడ్డొచ్చిన మహిళా కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం. బిజెపి దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేదికను ధ్వంసం చేస్తుంటే ఒక మహిళ వేదికపై కదలకుండా నిలబడి, చేతిలో గాంధీ చిత్రపటాన్ని పట్టుకుని ఉన్నారు.








కామెంట్‌లు (0)