విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న మేయర్ అభ్యర్థి ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని 37, 38, 40, 41 డివిజన్ల పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. బాబూరావు మాట్లాడుతూ... విజయవాడలో టిడిపి కూటమికి, వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఇండియా వేదిక అవతరిస్తుందని, పదేళ్ల తర్వాత నగరంలో మళ్లీ చైతన్యవంతమైన రాజకీయ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమిని, వైసిపిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
Video - విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎబి వెంకటేశ్వరరావును గెలిపించండి : ch.బాబూరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)