27 న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : ఎంపీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి బైరెడ్డిపల్లి మండలంలోని 16 ప్రాదేశిక నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం పూర్తయింది. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరిశీలనలో మొత్తం 82 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు వెల్లడించారు. ఆమోదం పొందిన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 31 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 42 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి ...
ఆలపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–2; బైరెడ్డిపల్లి–1లో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4; బైరెడ్డిపల్లి–2లో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, స్వతంత్రులు–1; బేలుపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.
చప్పిడిపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1, స్వతంత్రులు–1; దేవదొడ్డిలో వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1, జనసేన–2; ధర్మపురిలో టీడీపీ–3, వైఎస్సార్‌సీపీ–3 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు.
గొల్లచీమనపల్లి, కడపనత్తం నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కమ్మనపల్లిలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–4, కాంగ్రెస్–1; లక్కనపల్లి, ఎం.కొత్తూరు నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు.
నెల్లిపట్లలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–3, కాంగ్రెస్–1; పాతపేటలో టీడీపీ–2, వైఎస్సార్‌సీపీ–1, కాంగ్రెస్–1; తీర్థం, వెంగంవారిపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరేసి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు అధికారులు తెలిపారు.
27న ఉపసంహరణకు గడువు ....
అభ్యర్థిత్వ ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు తెలిపారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థులు బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ఫారం–VIIలో ఉపసంహరణ నోటీసును సమర్పించాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎంపీడీఓ కె. ఆనందబాబు, తహసీల్దార్ ఎం.ఎస్. ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)