మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదొంగ బాబాల పనిపట్టరే

53 నిమిషాల క్రితం

BABA.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 04:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందట. అలా ఉంది దేశంలో, రాష్ట్రంలో పాలకుల పరిస్థితి. నెహ్రూ కాలంలో బాబా అనే వాడు కనిపించేవాడు కాదు! ఇందిరా గాంధీ కాలంలో సగం నుండి బాబాలు బయలు దేరారు. మోడీ కాలంలో నేరుగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే స్థాయికి ఎదిగారు. మోడీనే నేరుగా కోయంబత్తూర్ దగ్గర జగ్గీ వాసుదేవ్ బాబా ఆశ్రమాన్ని ప్రారంభించారు. హత్యలు, అత్యాచారాలు చేసిన డేరా బాబాకు 20 ఏళ్ళ శిక్ష పడితే ఇప్పటికి17 సార్లు పెరోల్ బెయిల్ వచ్చింది. అది కూడా సరిగ్గ ఎన్నికల ముందర. జైల్లో కంటే బయటే ఎక్కువకాలం ఉంటున్నాడు. నిన్న తిరుపతిలో ఒక చదువుకున్న జంట నైమిశారణ్యంలోని మౌన బాబా బారిన పడి రూ.2 కోట్లు ధారపోశారు. తిరుపతి జిల్లాలో కల్కి, ప్రకాశం జిల్లాలో దొంగ రామదూత, రాజమాత బండ్లమాంబ లాంటి వారు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఎంత మోసం చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ అలుసు చూసుకొని బాబాలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని జైళ్లలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజలు ఇంకా మోసపోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇలాంటి దొంగల పని పట్టాలి.

-నార్నె వెంకటసుబ్బయ్య,భారత హేతువాద సంఘం అధ్యక్షుడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్