గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగురుశిష్యుల దారొకటే కదా?

1 గంట క్రితం

modi bhagava dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 05:28 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సిజెపి అనే ‘కాక్రోచ్‌ ‌జనతా పార్టీ’ అదేనండీ యుద్ధం చేస్తున్న బొద్దింకల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిషేక్‌ ‌దీప్కేపై ఇప్పుడు విశ్వవ్యాపితంగా ఫోకస్‌ ‌నడుస్తున్నది. అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు రాస్తున్నది. సిజెపి నేతలకు రాజకీయాలున్నాయా? వుంటాయా? అని పరిశీలనలు సాగుతున్నాయి. ఇప్పటికైతే ఆ ఆలోచన లేదనీ రేపు ఏం జరిగేదీ చెప్పలేమని గతంలో దీప్కే, సౌరవ్‌ ‌వంటి వారు చెప్పివున్నారు. అయినా అలాంటి మ్యాటర్లంటే మన మీడియా సోదరులకు బోలెడు క్యూరియాసిటీ కదా. ఒక పట్టాన వదలిపెడతారా? వారి సంగతి అలా వుంచి వారి తరఫున నిరాహారదీక్ష చేసి ఉత్కంఠ పెరగడానికి కారణమైన సోనమ్‌ ‌వాంగ్‌ ‌చుక్‌‌ను అడిగారు. ‘నాకైతే అలా అని పించలేదు గానీ అదేం తప్పు కాదు కదా!’ అని ఆయనన్నారు. వీరిలో చాలామంది గతంలో ఆప్‌‌తో కలసి పనిచేశారనేది ఇంత చర్చకు ఒక కారణం. కాకుంటే సౌరవ్‌ ‌వంటి వారిలో కొంత రాజకీయ ఆసక్తి గమనించానని వాంగ్‌ ‌చుక్‌ ‌చెప్పారు. దీనిపై దీప్కేను అడిగినప్పుడు ఆయన కూడా అదే విధంగా స్పందించారు. ‘రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు కాదుగానీ మా ఆలోచనలో అది లేద’ని స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే మరో ముక్క అనడంతో మనం ఇది చెప్పుకోవలసి వచ్చింది. ప్రధాని మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కంటే ఎక్కువని ఊహించుకుంటున్నారని అభిషేక్‌ ‌వ్యాఖ్యానించారు. నిరసన తెల్పవచ్చునని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బాస్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ అన్న మాట మోడీ పట్టించుకోలేదన్నారు. జెన్‌ ‌జీ ని సందేహించాల్సిన పని లేదనీ వారితో సంబంధం పెట్టుకోవలసి వుందని కూడా భగవత్‌ ‌చెప్పిన మాట మోడీ చెవికెక్కలేదని కూడా దీప్కే అన్నారు. ఇక్కడ విశేషమేమంటే నిజంగా మోహన్‌ ‌భగవత్‌ ఏదో మోడీ సర్కారును కాపాడేందుకు చక్రం అడ్డం వేయడమేగానీ నిజంగా అంత సహనం బోధించేవారేమీ కాదు. అలా అయితే మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచార రత్నంగా పనిచేసిన వారే కదా? వంద నాల్కలతో ‌పరిపరి విధాల మాట్లాడే పరివార్‌ బుద్ధిని బొద్దింక కింగ్‌ ‌పసిగట్టలేదా? ఇకపోతే విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌‌ లు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గొప్ప విజయమని అభినందనలు వెలువడుతున్నాయి. అంతవరకూ మంచిదే ‌గానీ తీవ్రమైన నేరాలు చేశారనే పేరిట 2900 మందిపైన కేసులు కొనసాగించడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది. జంతర్‌ ‌మంతర్‌‌లో అంత నేరాలు వారేం చేస్తారు? ఈ మినహాయింపును ఏలినవారు ఎలా దుర్వినియోగం చేస్తారో వేరే చెప్పాలా? ఆ మాటకొస్తే ఐషీ ఘోష్‌‌ను అరెస్టు చేయడానికి ఎకెజి భవన్‌‌కు వచ్చింది కూడా పాత కేసులోనే అన్నారు కదా. అందువల్ల కథ మిగిలే వుందని గుర్తించి ట్విస్టుల కోసం వెయిటింగ్‌ ‌చేద్దాం.

దళాలూ... దళపతులూ...

వారిజాక్షులందు వైవాహికములందు, ప్రాణవిత్త మాన భంగమందు.. బొంక వచ్చునంటూ పోతన కట్టిన శుక్రనీతి పద్యంలో చాలా మీనింగుంది. ఇక నవీన కాలపు పాలిటిక్సుకు ఇది మరెంతగా వర్తించాలి? ఇవన్నీ ఎలా వున్నా అధికారం అనేదానికోసం ఏం చేసినా తప్పు లేదనేది నేటి పాలకవర్గ అధినేతల దృష్టి. తమిళనాడులో అరవయ్యేళ్లుగా అధికారానికి దూరంగా నిరీక్షిస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు ఆగమేఘాల మీద డిఎంకె ను వదలిపెట్టి దళపతి విజయ్‌‌తో కలసి సర్కారులో చేరారంటే అదే కదా కారణం. అయితే ఇప్పుడు వారికో ధర్మ సంకటం వచ్చి పడింది. ఏమంటే ‘ఇండియా టుడే’, ‘సి ఓటరు’ సర్వేలో ‌సి.ఎం విజయ్‌ ప్రధాని రేసులో మూడో స్థానంలో వున్నట్టు వచ్చింది. దాంతో టివికె చెలరేగిపోయింది. రాహుల్‌‌ను ప్రధానిని చేయడమే జీవిత లక్ష్యమని వై.ఎస్‌ ‌రాజశేఖరరెడ్డి నుంచి రేవంత్‌ ‌రెడ్డి వరకూ రోజూ రామకోటి రాయడం మనకు తెలుసు కదా. అన్ని చోట్లా ఆ పార్టీ తీరు అదే కదా. మరి మోడీ ప్లేసులో రాహులుడు వచ్చేస్తాడని ముచ్చట పడుతున్న హస్తం పార్టీకి ఇది మింగుడు పడే ముచ్చటేనా? దాంతో వారు పెదవి విరవడం మొదలెట్టారు. ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని ఎక్కడవుతారు. అసలు విజయ్‌‌కి అంత ఆశ పనికిరాదంటూ నీతి నిగ్రహాలు వినిపించడం మొదలు పెట్టారు. అయినా ఆలూ లేదూ చూలూ లేదు గానీ కొడుక్కు మాత్రం ఆత్మలింగమని పేరన్నట్టు కాంగ్రెస్‌ ‌నేతలకు ఇంత అసహనం, ఆరాటం అవసరమంటారా? మరైతే ప్రధానిగా వుండ మని వెంటపడినా నిరాకరించిన జ్యోతిబసు, వి.పి.సింగ్‌ ‌వంటి వారి సంగతి ఎలా చెప్పాలి?

గ్రూప్‌ ఫోటో మార్ఫింగ్‌?

సాదాసీదా మనుషుల సంగతేమోగానీ అధినేతల విషయం వేరు. అందులోనూ దేశాల నేతలైతే ప్రతి కదలికా లెక్క ప్రకారమే. వారి ముందు ఎవరు నడవాలి. పక్కన ఎవరుండాలి అన్నీ నిర్ణయమై వుంటాయి. ప్రోటోకాల్‌ తతంగం ఇందుకోసమే. కిర్గిస్తాన్‌‌లో నిన్న మొన్న షాంఘై సహకార సంఘం (ఎస్‌‌సిఒ) శిఖరాగ్రసభ జరిగింది. మీడియా కోసం గ్రూపు ఫోటోలు తీసుకున్నారు. ఎస్.సి.ఒ లో ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్‌ ‌వంటివన్నీ వున్నాయి. ఈ సభ నుంచి తిరిగి వెళ్లిన పాకిస్తాన్‌ ‌ప్రధాని షహబాజ్‌ ‌షరీఫ్‌ అయిదుగురు నేతల గ్రూపు ‌ఫోటో విడుదల చేశారు. దాంట్లో షహబాజ్‌ ‌మధ్యలో వుంటే అటూ ఇటూ రష్యా అ‌ధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు సీ జిన్‌‌పింగ్‌ ‌వున్నారు. ఇదైతే జరిగేది కాదు కదా? కీలకమైన అగ్రనేతలు పక్కన నిల్చుని పాకిస్తాన్‌ ‌ప్రధానిని మధ్యలో నిలబెడతారా? ప్రోటోకాల్‌ ఏమైపోతుంది? ఈ సందేహం అందరికీ కలిగింది. ఈ లోగా ప్రధాని మోడీ కార్యాలయం అదే ఈవెంట్‌‌ ఫోటో విడుదల చేసింది. దీంట్లో షహజాబ్‌ ‌గాక మరో నలుగురున్నారు. పైగా ఆయన మధ్యలో లేడు, ఒకవైపు చివర నుంచి నాలుగో వారుగా వున్నారు. ఇప్పుడు ఫోటో క్లియరైందా? సార్‌ ఫోటోలో ఇటు వైపు వారిని తొలగించి అంటే క్రాప్‌ ‌చేసి మిగిలిన అయిదుగురినే వుంచారు. దాంతో తనే సెంట్రల్‌ ‌ఫిగర్‌ అయిపోయారు. కానీ చూడ్డానికి సిల్లీగా లేదూ? అంతర్జాతీయ స్థాయిలో ఇంత చీప్‌గా గ్రూప్‌ ‌ఫోటో మార్ఫింగ్‌ ‌వ్యవహారమా?

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్