శరీరంలో అయోడిన్ కొరత ఏర్పడితే పలు ‘అయోడిన్ లోప రుగ్మతలు’ కలుగుతాయి. అయోడిన్‌తో కూడిన ఆహార పదార్థాలను నిరంతరం సక్రమంగా తీసుకున్నట్లైతే, ఈ రుగ్మతలు నివారించబడుతూ సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది. శరీరంలో అయోడిన్ లోపం వల్ల గాయిటర్ (థైరాయిడ్ విస్తరణ), న్యూరో మస్కులర్ (నాడీ కండర) బలహీనతలు, హైపో థైరాయిడిజమ్, వినికిడి బలహీనత, స్పీచ్ (మాట) బలహీనత, బుద్ది మాంద్యం (ఇంటలిజెన్స్ స్థాయి తగ్గడం), చూపు మందగించడం, స్పాస్టిసిటీ, క్రెటినిజమ్ లాంటి అయోడీన్ లోప రుగ్మతలు జనిస్తాయి. గర్భిణిలో అయోడిన్ లోపం వల్ల శిశువు సమగ్రాభివృద్ధి ప్రభావితం అవుతుంది. శరీరంలో అయోడిన్ ఉత్పత్తి కాదు, కాబట్టి అయోడిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే తప్పనిసరియని గమనించాలి. ఒక ఆరోగ్యవంతుడికి రోజుకు సగటున 100 - 150 మైక్రోగ్రామ్‌ల అయోడిన్ అవసరం అవుతుంది. అయోడైజ్డ్ సాల్ట్, సముద్ర ఆహారం, పాలు, పెరుగు, బ్రెడ్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, అరటి పండ్లు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు లాంటి ఆహారంలో అయోడీన్ లభ్యమవుతుంది. అయోడిన్ లోప రుగ్మతలు నివారించదగినవని, అయోడిన్ సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
- బి.ఎం.ఆర్, సెల్: 9949700037.








కామెంట్‌లు (0)