బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition అయోధ్య చోరీ మాటెత్తరే!

2 గంటల క్రితం

Ayodhya Scam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 05:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టీవీలకు రాజకీయాలు ఉండ కూడదు. స్వతంత్రంగా పని చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఆ మధ్య తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అన్ని చానళ్లు ప్రతి రోజూ అదే చర్చలు పెట్టి విసుగు పుట్టించాయి. కొన్ని రోజులు గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై చర్చల మీద చర్చలు. మరి కొన్నాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ అటవీ భూముల ఆక్రమణ మీద చర్చలు. ఒక వారం నుండి ప్రశ్న రావణ్‌ మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి. బాగానే ఉంది.

అయితే అయోధ్య బాలరామాలయం లో హుండీలోకి చేరాల్సిన వేల కోట్ల రూపాయలు, ఖరీదైన నగలు దొంగతనం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇపుడు హుండీ డబ్బులు లెక్కపెట్టేవారికి జేబులు లేని చొక్కాలు వేసుకురమ్మని ఆదేశించారట. తిరుపతిలో అక్రమాలు జరిగాయని తెగ చర్చలు పెట్టిన టీవీ చానళ్ల వారు, అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనం మీద ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎత్తితే మోడీ మొట్టికాయలు వేస్తాడనీ భయమా?? 150 కోట్ల దేశ జనాభాకు ప్రధాని అయిన మోడీ ఈ గుడిని శ్రద్ధ తీసుకొని కట్టించారు కదా. మరి అక్కడ జరిగిన దొంగతనంపై నోరు మెదపటం లేదు. ఏమిటి కారణం ?

​- నార్నె వెంకట సుబ్బయ్య,

భారత హేతువాద సంఘం అధ్యక్షుడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్