నేడు ఫిఫా ప్రపంచకప్ రెండో సెమీస్
అర్ధరాత్రి 12.30గం.ల నుంచి
న్యూయార్క్ : ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. 2022లో కతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ టైటిల్ కొట్టిన అర్జెంటీనాతో 1966లో ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు తలపడనుంది. అట్లాంటా స్టేడియంలో బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ కోసం బెర్త్ సాధించనుంది. 1066లో టైటిల్ కొట్టిన తర్వాత ఇంగ్లండ్ ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్‌ఫైనల్ వరకు మాత్రమే. గత సీజన్‌లోనూ క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్.. ఫ్రాన్స్ చేతిలో ఓడింది. ఈసారి సెమీస్‌కు చేరిన హ్యారీ కేన్ సేన టైటిల్‌పై ఆశలు రేపుతోంది. గ్రూప్ దశలో పనామా, క్రొయేషియాలపై గెలిచి ఘనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకొని టాపర్‌గా రౌండ్-32కు ప్రవేశించిన ఇంగ్లండ్.. ఆ రౌండ్‌లో డి.ఆర్ కాంగోను, ప్రీ క్వార్టర్స్‌లో ఆతిథ్య మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లోకి పటిష్ట నార్వేను 2-1తో ఓడించిన ఇంగ్లండ్‌కు సెమీఫైనల్లో అర్జెంటీనా అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఈ సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తూ వరుసగా మూడోసారి సెమీస్‌కు చేరింది. లియోనెల్ మెస్సీతోపాటు ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. రౌండ్-16లో ఈజిప్ట్‌పై 2-0తో వెనుకబడ్డా.. కేవలం 14 నిమిషాల వ్యవధిలో 3గోల్స్ కొట్టి విజయం సాధించిన తీరు వర్ణణాతీతం. క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై 3-1తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక సెమీస్‌లో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఈ జెర్సీతోనే 1986, 1998లలో ఇంగ్లండ్‌పై ఈ జెర్సీతో ఆడి అర్జెంటీనా గెలిచింది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య హోరా హోరీ పోరు సాగడం ఖాయం.






కామెంట్‌లు (0)