శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసునామీ విపత్తులు అవగాహన

2 రోజుల క్రితం

సముద్రంలో భూకంపాలు రావడం, వాల్కనో విస్ఫోటనాలు జరగడం, కొండచరియలు విరిగిపడడం,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 05:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సముద్రంలో భూకంపాలు రావడం, వాల్కనో విస్ఫోటనాలు జరగడం, కొండచరియలు విరిగిపడడం, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, ఉల్కాపాతం ఉద్భవించడం లాంటి విపత్తులు సంభవించినపుడు సముద్రపు అలలు నోళ్లు తెరుచుకొని ఉవ్వెత్తున 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతూ, గంటకు 800 కిమీ వేగంతో రాకాసి అలలు ప్రయాణిస్తూ, తీర ప్రాంత జనావాసాలను మహా విపత్తు ముంచేయడమనే సునామీ అంటాం. సునామీ విపత్తుల పట్ల విషయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, విపత్తు ప్రమాదపు అంచున నివసిస్తున్న తీర ప్రాంత ప్రజలను సన్నద్ధం చేయడం, గత సునామీ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం, సునామీ బాధితులకు సంఘీభావం తెలియజేయడం, ఆధునిక డిజిటల్‌ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సునామీలను ముందస్తు అంచనాలతో హెచ్చరికలు జారీ చేయడం, ప్రపంచ దేశాలు సమన్వయంతో పని చేయడం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని ఏకరువు పెట్టడం, రాబోయే తరాలకు సునామీ పట్ల కనీస జ్ఞానాన్ని అందించడం లాంటి అంశాలు సునామీ వల్ల జరిగే ప్రాణ ఆస్తి నష్టాలను పూర్తిగా తగ్గిస్తాయని గమనించాలి. పర్యావరణ కాలుష్యంతో సంభవిస్తున్న ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా కూడా సునామీలు ఎగిసిపడవచ్చని తెలుసుకుందాం. సునామీలు నేర్పిన గత గుణపాఠాలను మరువకుండా రాబోయే రోజుల్లో రాకాసి అలల వలలో పడకుండా తీర ప్రాంత మానవాళిని కాపాడుదాం. సునామీ సృష్టించే విధ్వంసానికి అడ్డుకట్ట వేద్దాం.

(నవంబర్‌ 5 ప్రపంచ సునామీ అవగాహన దినం)

​ - డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,

సెల్‌: 9949700037​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్