గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మేంద్ర ప్రధాన్‌ ఎందుకు రాజీనామా చేయాలి..?

1 గంట క్రితం

dharmendra pradhan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 10:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఈ దేశం ని పరిపాలించాలంటే రాజకీయపార్టీ ఉండాలి. పాలించే విధానాలు అన్నీ రాజకీయ విధానాలు. చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ రాజకీయమే. రాజకీయం కానిది అంటూ ఉంటుందా ? పాలించే రాజకీయ పార్టీ తన విధానాలతో ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. అది మంచిగా అయినా, చెడ్డగా అయినా.. అది చెడ్డగా ఉంటే, తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది, ఆ ప్రతిఘటనకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు అనుకోవడం అమాయకత్వం.


ఇక్కడ అసలు నీట్ పరీక్ష మీద దేశ వ్యాపిత ఉద్యమానికి పిలుపు ఇచ్చిందే ఒక రాజకీయ పార్టీ (CJP). ఆనక దానికి మద్దతు పలికాయి మరికొన్ని రాజకీయ పార్టీలు.

ఇందులో యే రాజకీయాలకీ సంబంధం లేని వాళ్ళు మాత్రమే ఉండాలి అని కోరుకోవడం అవగాహనారాహిత్యం. ఇక, ఇందులో విద్యార్థులే లేరు అనడం టెంపరితనం. మీడియాల్లో,వీడియోల్లో కనిపిస్తూన్న కుర్రాళ్ళు ఎవరూ.. విద్యార్థులు కాదు అని యే ఆధారాలతో చెబుతున్నారు ? ఢిల్లీ & పొరుగు రాష్ట్రాల్లో మాస్ బంక్ చేసి చాలా కాలేజీల విద్యార్థులు ఢిల్లీ రోడ్ల మీద ర్యాలీ చేస్తున్నారు,దెబ్బలు తింటున్నారు.


నీట్ రాసిన వాళ్ళే ఇందులో పాల్గొవాలి, ఇతరులు పాల్గొకూడదు అనడం అజ్ఞానం. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహాజారే ఢిల్లీ లో దీక్ష చేసినప్పుడు, లక్షలాదిగా వచ్చిన వాళ్లంతా లంచాలు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు మాత్రమే అనుకుంటామా ? 2011లో కామన్ వెల్త్ గేమ్స్ లో అవినీతి మీద, వేలాది మందితో బీజేపీ ఇదే జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాల్లో పాల్గొన్న వాళ్లంతా క్రీడాకారులే ఉండాలి అని అన్నామా ? అజ్ఞానం స్క్వేర్ 😄


ఇక రాముడికి వ్యతిరేకంగా పాటలు, అల్లా మీద పాటలు పాడుతున్నారు....ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు, ఎప్పుడు, ఎందుకోసం చేస్తారో ఈ దేశ యువత బాగా గ్రహిస్తున్నారు. అందువలన ఇంకా ఆ అసత్య ప్రచారాల గురించి మాట్లాడి మరింత దుష్ప్రచారం చెయ్యడం కూడదు....అంతర్వేది రధం,తిరుపతి లడ్డూ కల్తీ వివాదాల దోషులను ఈ రెండేళ్లలో పట్టుకున్నట్టే ఉంటాయి ఆ మాటలు. అసలు ఇదంతా బోగస్ ఐతే చర్చల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది ?

- శ్రీనివాస్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్