గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅట్టహాసంగా ప్రారంభమైన కామన్వెల్త్‌ క్రీడలు

1 గంట క్రితం

commenwelth games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సెమీఫైనల్‌కు బాక్సర్ లవ్లీనా.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఎదురుదెబ్బ

గ్లాస్గో(స్కాట్లాండ్‌): 23వ కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలోని ఓవీవో హైడ్రో వేదికగా గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్టార్‌ ‌మహిళా బాక్సర్‌ ‌లౌవ్లీనా బోర్గోహైన్, వెయిట్‌ ‌లిఫ్టర్‌ మీరాబాయ్ చాను ‌త్రివర్ణ పతకంతో భారత బృందం ముందు నడిచారు. సగర్వంగా ప్రదర్శిస్తారు. స్టాట్లాండ్ దేశానికి చెందిన సింగ్ లిరిసిస్ట్ కెటి. టన్స్‌టాల్, ఫోక్ మ్యుజీషియన్ నాథన్ ఈవన్స్, స్కాటిష్ మ్యూజిక్ బృందం సెయింట్ ఫింక్స్‌లు తమ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచం అబ్బురపోయేలా ఈ గ్రాండ్ స్పోర్టింగ్ ఈవెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు హాజరయ్యారు కింగ్ చార్లెస్ -3, క్వీన్ కామిల్లాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం కింగ్ చార్లెస్ కామన్‌వెల్త్ గేమ్స్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక కామన్వెల్త్‌ ‌క్రీడల ప్రారంభానికి ముందే భారత్‌ ఖాతాలో పతకం చేరింది. 75 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో కేవలం ఐదుగురు పోటీదారులు ఉండటంతో స్టార్ బాక్సర్ లౌవ్లీనాకు బై లభించి సెమీఫైనల్ చేరుకుంది. బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీస్ చేరిన బాక్సర్లకు పతకం ఖాయం కానుంది. దీంతో లౌవ్లీనాకు పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బొర్గోహైన్‌ మహిళల 75 కేజీల విభాగంలో బరిలో దిగుతోంది. 31న జరిగే సెమీఫైనల్ బౌట్‌లో లౌవ్లీనా బరిలోకి దిగనుంది. కెరీర్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించిన లౌవ్లీనాకు కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలి పతకం.

అస్సాంకు చెందిన ఈ బాక్సర్ టోక్యో ఒలింపిక్స్‌ (2020)లో కాంస్య పతకం (69 కేజీల విభాగం), 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం (75 కేజీలు) సాధించింది. 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2023 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది.

వెయిట్‌ ‌లిఫ్టర్లకు ఎదురుదెబ్బ...

వెయిట్‌లిఫ్టింగ్‌లో పలువురు ఆటగాళ్లు డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో భారత్‌కు కేటాయించిన కోటాను కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి తగ్గించింది. తొలుత 16 బెర్త్‌‌లను భారత్‌‌కు ప్రకటించగా.. దానిని ఇప్పుడు 11కు పరిమితం చేసింది. దీంతో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య ప్రకటించిన 12 మంది జట్టులో ఒకరిని తప్పించాల్సి వచ్చింది. అజిత్ (71కిలోలు), సాయిరాజ్ పరదేశి (88కిలోలు), హర్‌చరణ్ సింగ్(110కిలోలు), వంశితా వర్మ (86కిలోలు) డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కోత పడింది. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను వెయిట్‌‌లిఫ్టింగ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తోంది. ఇక జూడోలో 73 కేజీల విభాగానికి చెందిన అరుణ్ కుమార్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ (నాడా) అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. ఈ క్రీడాంశంలోనూ భారత్‌ 14 మంది ‌నుంచి 13మంది అథ్లెట్లకే పరిమితమైంది.

బౌల్స్‌లో ప్రతుల్‌ సంచనం

కామన్వెల్‌ క్రీడల ప్రారంభానికి ముందే బౌల్స్‌లో ప్రతుల్‌ సంచలనం నమోదు చేశాడు. గురువారం జరిగిన బౌల్స్‌లో ప్రతుల్‌ ప్రస్తుత అవుట్‌డోర్స్‌ సింగిల్స్‌ ఛాంపియన్‌ను ఓడించాడు. తొలి సెట్లో తొలుత 2-0 ఆధిక్యతలో ఉన్న ప్రతుల్‌.. ఆ తర్వాత 3-2, ఆ తర్వాత 4-4పాయింట్లతో సమంగా ఉన్నారు. ఈ క్రమంలో 5-4పాయింట్ల ఆధిక్యతను సంపాదించిన ప్రతుల్‌.. చివర్లో 2పాయింట్లు సాధించి ఆ సెట్‌ను 7-2తో గెలిచాడు. ఇక రెండో సెట్‌ను 7-3తో గెలిచాడు. మాల్టాతో జరిగే మహిళల పెయిర్స్‌ విభాగంలో గ్రూప్‌ దశలో రూపరాణి టిర్కి-పింకీ సింగ్‌ భారత్‌ తరఫున జంటగా బరిలో దిగుతున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో పుతుల్‌ సోనోవాల్‌, ర్యాన్‌ బెస్టర్‌తో తలపడనున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్