చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో *ముగిసిన భారత్ పోరు
బీజింగ్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పివి సింధు, లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టి ప్రత్యర్థుల చేతిలో పోరాడి ఓడారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-16, 20-22, 18-21తో చైనాకు చెందిన 4వ ర్యాంకర్ చెన్ యూఫీ చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను చేజిక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లోనూ విజయానికి చేరువైంది. 20-20స్కోర్‌తో సమంగా ఉన్న దశలో సిందు వరుసగా రెండో పాయింట్లు చేజార్చుకోవడం, ఆ తర్వాత గేమ్‌లోనూ పోరాడినా తనకంటే టాప్ ర్యాంకర్ చెన్ యూఫీ రాణించడంతో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 19-21, 11-21తో కేవలం 46నిమిషాల్లోనే కెనడాకు చెందిన 8వ ర్యాంకర్ విక్టర్ చేతిలో వరుససెట్లలో ఓడాడు. యువ షట్లర్ ఆయుశ్ శెట్టి 21-15తో తొలి గేమ్‌ను నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-13, 22-20తో చేజార్చుకొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆటగాని చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.








కామెంట్‌లు (0)