బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రాష్ ల్యాండింగ్

05 ఆగస్టు, 2026

Kavith
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నీ విల్లు బాణాలు

ఇప్పుడవి నీవి కావు

నీ రక్తంలో ఇంకిపోయిన అడవి ధైర్యం

ఇప్పుడు నీ పేరుతో లేదు

నీ బతుకు పాటల్లో వినబడిన వీరుడు

ఇప్పుడొక కార్పొరేట్ ఐకాన్!

జేబులో చిల్లర నింపి

నీ నేల నుంచి నిన్నే గెంటేశారు

నీ పాదాలు పాడే పాట

నీది కాదు

నీ చీకట్ల మీద వెలిగే

ఒక్క ఫోకస్ లైట్ కూడా లేదు

నేలనివ్వడమంటే

విడతలుగా ఊపిరి కోల్పోవడమే!

చెదపురుగుల్ని ఎలా డీల్ చేయాలో

పాములకు ఎవరూ నేర్పించనక్కర్లేదు

నీ ఆకుపచ్చని కలలన్నీ

టేకాఫ్‌లోనే ఖర్చైపోతాయి

ఫేజ్‌వైజ్ రివ్యూలో

రీ-రివైజ్ చేసిన ప్యాకేజీ

నిన్ను వైతరణి దాటించదు

భూములిచ్చిన పాపానికి

బతుకులన్నీ క్రాష్ ల్యాండింగ్‌‌లే!

- సా. మూ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్