గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుక్క కాటుకు....

4 గంటల క్రితం

dog
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 03:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వీధి కుక్కలు, జంతువులను తాకకుండా ఉండడం, సాధు జంతువులకు టీకాలు వేయించడం, సాధు జంతువులు బయటకు వెళ్లినపుడు జాగ్రత్తగా పర్యవేక్షించడం, కాటు వేసిన లేదా గీరిన వెంటనే నీటితో శుభ్రం చేయడం, వెంటనే పూర్తి డోసుల టీకాలను తీసుకోవడం, విచిత్ర ప్రవర్తన కలిగిన కుక్కల సమాచారాన్ని అధికారులకు అందించడం విధిగా జరగడానికి ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలి. కుక్క కాటుతో మాత్రమే రేబిస్‌ వస్తుందనే అవాస్తవాలను నమ్మకపోవడం, చిన్న కాటు లేదా గీరినపుడు ఏమీ కాదని నిర్లక్ష్యం చేయడం, కాటు వేసిన కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడతాయని తెలుసుకోవడం, రేబిస్‌ వైరస్‌ కలిగిన కుక్కల నోటిలోంచి నురగ కారడం, ఒక్కసారి రేబిస్ టీకా జీవితకాలం పని చేయదని గమనించడం, సాంప్రదాయ పద్ధతులతో రేబిస్‌ చికిత్సలను మానేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పుతుంది. నేడు మన దేశంలో దాదాపు 4 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. అత్యధిక సంఖ్యలో సంచరిస్తున్న వీధి కుక్కలకు టీకాలు వేయడం కొంత కష్టమే. అయినా వాటికి టీకాలు వేస్తూ, వాటి సంతానోత్పత్తిని కట్టడి చేయడం సమాంతరంగా జరగాలి. భారత ప్రభుత్వం దేశవ్యాప్త ఆసుపత్రుల్లో రేబిస్‌ టీకాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఉచితంగా వేయడం కనీస కర్తవ్యంగా ఏర్పాటు చేయాలి.


- డాక్టర్‌ బి.ఎం.ఆర్‌,

సెల్‌: 9949700037.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్