ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అహం మత్తు!

1 రోజు క్రితం

sas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పిల్లల వీపులపై విరిగిన లాఠీలు

మన్ కీ బాత్ లో ఏమంటాడో నేత !

వారు కాదు అల్లరి పిల్లలు

కానే కాదు మూర్ఖులు

పరీక్షలు ఎలా రాయాలో చెప్పే వానికి

ఎలా జరపాలో చెప్తున్నారు!

ప్రతి నిరసనలో విదేశీ హస్తం కాదు

తమ నిర్లక్ష్య చిత్తం చూడాలి

యువ తరంగం అంతరంగం తెలియాలి

వారి అనిశ్చితి హేతువు తొలగాలి

పత్రికలు నిజం పలకాలి

ప్రతి పక్షం నిలవాలి ప్రజల పక్షం

మత అధిహంకారం

మత్తు దించిన యువ జన సృజన పోరు!

- డా. జె. రవీంద్రనాథ్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్