బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎర్ర జెండ బిడ్డ

1 గంట క్రితం

mallareddys7526c-1787669602933-2693.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 04:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సాకి :

నేలతల్లి కడుపు కోత ఆర్తనాదమయ్యింది

దుక్కి దున్నే నాగలి గుండె పగిలి ఏడ్చింది

రైతు బిడ్డ మల్లారెడ్డి కనుమూశాడని

పొగిలి పొగిలి ఎర్రజెండ అవనతమయ్యింది.

పల్లవి:

నీ పలకరింపు రైతన్నకు పులకరింపులే

ప్రశ్నను సంధిస్తే పాలకులకు జలతరింపులే పంచ కట్టి రైతులతో జట్టు కట్టి కదిపి

పోరు బాట పట్టించిన ఎర్ర జెండ బిడ్డవి.

అను పల్లవి:

అందుకో జోహార్లు సారంపల్లి మల్లారెడ్డి

గుర్తుచేసుకుంటాం మా గుండెల్లో గుడి కట్టి

చరణం:

రైతన్నల అగచాట్లకు కారణాలు వెతికావు

సమాచార సేకరణలో మేటివై నిలిచావు

రైతులకు నీ మాట వేదం లా చేశావు

అఖిల భారత కిసాన్ సభ నేతవై సాగావు.

చరణం 2

పల్లె జీవనమైన ప్రపంచ పరిణామమైనను

అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పావు

జ్ఞాన తృష్ణతో విజ్ఞాన ఖనివై వెలిగావు

పెద్దలకు పిల్లలకు ప్రేమ పాత్రుడివయ్యావు.

చరణం 3

సామాన్యుడిగ సాగిన మీ జీవన యానం

నిన్ను కన్న తల్లి ఎర్ర జెండాకే గర్వకారణం

కమ్యూనిస్టు విలువలే ఆభరణం అన్నావు

మంచి కమ్యూనిస్టెలా ఉండాలో చూపావు.

- బి. దశరథ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్