తీరంలో మడ అడవులు
పుడమికి రక్షణ కవచాలు
అలజడి చేసే కెరటాలను
కలబడి నిలబడి ఆపును..!
సాగర తీరములోన మడ
సగర్వంగా పెరుగుతుంది
తీర సాగర మాత మెడలోన
పచ్చలహారమై మెరుస్తుంది..!
నదులు కడలిలో కలిసే తావున
మడ చెట్లు పెరుగును పొదలుగా
ఉప్పునీటిలో పెరిగే మడ మొక్కలు
ఉప్పెన ఆవేశాన్ని చప్పున చల్లార్చు..!
భూమి కోతలను మడత పెట్టును
జలచరాలకు సంతాన సాఫల్యం
సునామీలు వచ్చినా సునాయసంగా
మడ అడవి వాటి మెడలు వంచును..!
మానవ మనుగడకు మడ చెట్లు
జీవ వైవిధ్యం సంరక్షణకవి మెట్లు
సంగమేశ్వరం సాగర తీరమందు
లక్షల్లో నాటిరి మడ మొక్కలను..!
అటవీ అధికారులు అప్రమత్తమై
దివిసీమ లోని మడ అడవులను
మడము తిప్పకుండా కాపాడాలి
విపత్తుల నుంచి ప్రజను రక్షించాలి..!
- జి.సూర్యనారాయణ,
సెల్: 6281725659







కామెంట్‌లు (0)