శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమాతృభాషా దేవోభవ!

28 ఆగస్టు, 2026

mother-language-day-.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమ్మ ఒడిలో నేర్చిన తొలి మధుర పలుకు,

చనుబాల అమృతంతో ఆస్వాదించిన తీరు...

గోరుముద్దల రుచులతో గొంతులోకి దిగుతుంటే,

మనసంతా నిండిన మృదువైన పలుకు!


చిట్టి అడుగులతో చిందులేసిన శబ్దం,

గుండెలయలలో నోట పలికిన పదం...

అమ్మ ముఖంలో చిరునవ్వుల సవ్వడితో,

పిల్లల మనస్సులో నిలిచిన అక్షరం!


అమ్మ ప్రేమలోని భావ తరంగంతో,

అంతరంగంలో ఉదయించిన రూపం...

నవ్వు, ఏడుస్తూనే ఎగిసిపడుతూ,

ఇల్లంతా సందడి చేసిన నోటి రాగం!


సంస్కృతికి శోభనిచ్చే పవిత్ర భావన,

ఎద లోతుల్లో అల్లుకున్న భావాల మాలిక...

పుట్టుకతోనే జోలపాటలు వింటూ,

కాల అందెలతో నర్తించే లయా తరంగం!


శ్వాసలో సరికొత్త ఆశలు నింపుకునేందుకు,

హృదయ పలుకుల వీణలు మోగించేందుకు...

పదం పదం కలిసి భావోద్వేగ అలలై ఎగిసి,

కంఠంలో మధుర రాగ తరంగ నాదం!


'మాతృ, పితృ, ఆచార్య దేవోభవ' శోభతో...

ఇకపై 'మాతృభాషా దేవోభవ' అని చాటుదాం,

అమ్మ ఒడి పలికించిన అక్షరాలనే

మన మూలాల రూపంలో కాపాడుకుందాం!

- కొప్పుల ప్రసాద్,

సెల్‌: 9885066235



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్