శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వలస పక్షులు

3 గంటల క్రితం

migrants
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ దేశం వెయ్యి ముక్కలయ్యింది

మతాలుగా, కులాలుగా, గోత్రాలుగా

ప్రజలూ - వాళ్ళ మెదళ్ళూ అన్నీ

ముక్కలయిపొయ్యాయి,

తుత్తునియలైపొయ్యాయి.

ఈ దేశంలో మా ప్రతి రోజూ

కాలిపోతూ ఉంది.

మా జీవితపు ప్రతిక్షణాన్ని

మాడ్చేస్తూ ఉంది.

అన్నీ భరిస్తూ, బండలా పడి ఉండడం

ఇక మా వల్ల కాదు-

భరించం- ఒప్పుకోం!

మా అరుపులు, మా కేకలు

ఈ దేశ చరిత్రను తిరగరాయడానికి

చేసే ప్రయత్నాలే!

హృదయం లేని మతంతో

ఈ దేశం నగ్నంగా నిలబడి ఉంది-

ఇక్కడి నేతలు దొడ్డి దారి చట్టాలతో

ఖుషీ ఖుషీగా జల్సాలకు అలవాటు పడ్డారు

అసలు మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమన్నది

కూడా మరిచిపొయ్యారు-

ఇంకా ఎందుకిక్కడ? పదండి పోదాం…

బతికినంత కాలం,

ఇంత కూడూగుడ్డా దొరికే చోటికి!

చస్తే - నాలుగడుగుల

ప్రశాంత స్థలం దొరికే చోటికి!!


( ప్రతిరోజూ ఇక్కడి పౌరసత్వం వదులుకుని సుమారు 500 లకు పైగా భారతీయులు వలసలు పోతున్న నేపథ్యంలో )

- ప్రొ. దేవరాజు మహారాజు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్