మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమృతం

03 ఆగస్టు, 2026

Mother
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమ్మంటే జన్మనిచ్చిన దైవం

ఆ అమ్మ పాలు అమృతం

శిశువుకు అందించే స్తన్యం

సంపూర్ణ పోషక భరితం

బాలల ఎదుగుదలకు ఆలంబనం

భావి జీవితానికి శుభ శ్రీకారం

వ్యాధి నిరోధకత పెంచే ఔషధం

ప్రకృతి ఒసగిన సహజ రక్షణ కవచం

తల్లీబిడ్డల నడుమ మురిపాల బంధం

ఇరువురి ఆరోగ్యానికీ ఇచ్చేను అభయం

అందుకనే,

పుట్టిన తొలి గంటలోనే పట్టాలి తల్లిపాలు

పడుతూనే ఉండాలి మరో ఆరు నెలలు

కొనసాగిస్తే మేలు ఆపై రెండేళ్ళు.


( తల్లి పాల వారోత్సవాల సందర్భంగా)

డా. డి.వి.జి శంకరరావు,

మాజీ ఎంపీ, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్