నీ ప్రశ్నకు వాళ్లెప్పటికీ
గొంతివ్వరు
నిశ్శబ్దాన్నే ప్రేమిస్తారు వాళ్లు.
నిశ్శబ్దమంటే ఇక్కడ ప్రశాంతత కాదు
వ్యక్తిత్వాలు అమ్ముడుపోయి
మిన్నకుండటం
ఎందుకలా జరుగుతుందో తెలుసా?
వాళ్ల సుఖవంతమైన జీవితం
వాళ్లను మాట్లాడకుండా చేస్తుంది
వారికి కల్పించబడిన చిన్న చిన్న వసతులు
వారి పెద్ద పెద్ద నోళ్లనూ మూయిస్తాయి.
నువ్వు కోల్పోయిన వాళ్ల
వరుసలో నిలబడ్డవాడివి
వాళ్లకు కావలసినది దాన్ని
వాళ్లు ముందే పొందియున్నారు
విభజించి పాలించే కుట్రలో
పావులైనవాళ్లు వాళ్లు.
ఇతరుల నోటికాడి కూడు
అక్రమంగా మాయమవుతున్న
తీరును ప్రశ్నించటానికి
నిజానికి వారి నోళ్లు ఖాళీగా లేవు.
నోటిలో ఎముక వున్న కుక్కలు
పొరపాటున కూడా మొరగాలనుకోవు
వారూ అంతే
నీతో ఎందుకు గొంతు కలుపుతారు!
- చిత్తలూరి,
సెల్: 9133832246







కామెంట్‌లు (0)