మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టీకా రక్షణ కవచం

16 గంటల క్రితం

tika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

“చికిత్స కన్న నివారణే మిన్న” అనే నినాదం అనాదిగా వింటూనే ఉన్నాం. ప్రాణాంతక వ్యాధులను జీవిత కాలంపాటు తరిమేయగల రక్షణ కవచం టీకా. అందరికీ టీకాలను వేయించే ప్రయత్నాలు చేయడం మన కనీస బాధ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, ప్రతి ఏటా 20 నుంచి 30 లక్షల మంది పిల్లలు చనిపోవడం గమనించారు. 1974 నుంచి నేటి వరకు టీకాలు వేయడం వల్ల కనీసం 15.4 కోట్ల మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. చిన్నతనంలోనే టీకాలు వేయించడం వల్ల డిప్తీరియా, టెటనస్‌, పోలియో, మీజిల్స్‌ (తట్టు), కోవిడ్‌-19, న్యుమోనియా, రోటావైరస్‌ డయేరియా లాంటి పలు ప్రమాదకర వ్యాధులకు జీవిత కాల అడ్డుకట్ట వేయబడింది. సులభంగా ప్రయోగించే చవకైన, అత్యంత ప్రభావిత టీకాలతో పౌర సమాజానికి జీవితకాల సురక్ష కవచం ఏర్పడుతుంది. ​జాతీయ టీకా దినం వేదికగా టీకా ఔషధాల పట్ల అవగాహన, టీకాల పట్ల భయాలను లేదా అపార్థాలను తొలగించడం, టీకా ఉద్యమంలో భాగం కావడం, ప్రభుత్వ టీకా కార్యక్రమాలకు ప్రచారం నిర్వహించడం, టీకా ఉద్యమానికి తమ సేవలను అందిస్తున్న వైద్య ఆరోగ్య కార్యకర్తలను సన్మానించుకోవడం నిరంతరం కొనసాగాలి. ప్రమాదకర అంటురోగాల కట్టడి, శిశు మరణాలను తగ్గించడం, సామాజిక ఆరోగ్య భాగ్యాలను పెంచడం, చవకగా టీకాలను అందుబాటులో ఉంచడం, సమాజ రోగనిరోధకా శక్తిని పెంచడం లాంటి ప్రధాన లక్ష్యాలతో కొనసాగుతున్న టీకా ఉద్యమాలను ప్రోత్సహించడం, సమాజ చైతన్యానికి పూనుకోవడం లాంటి పలు కార్యక్రమాలను నిర్వహిద్దాం.


/నవంబర్ 10 ప్రపంచ రోగనిరోధకత దినోత్సవం/

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,

సెల్‌: 9949700037

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్