ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ డీజే సౌండ్స్ ఏలయ్యా..

1 గంట క్రితం

dj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వినాయకా.. ఏమిటీ వైపరీత్యం..?

గణనాథా ఎందుకీ మృత్యు బాకా

గజనాథా... ఈ డీజే సౌండ్స్ ఏలయ్యా..

మీ నిమజ్జనాల ఊరేగింపులలో...!

సామూహిక మైకుల ధ్వనులకు

మా గుండెలు అదిరిపోయేను

మా కర్ణ భేరులు పగిలిపోయేను

రహదారులు దద్దరిల్లిపోయేను

లేత గుండెలు పూతలా రాలిపోయేను...!

చిట్టెలుక వాహనమెక్కి నీవు

చెంతనే ఉన్న చెరువులో మునిగేందుకు

హడలి పోయే డీజేల ఘోష అవసరమా

భూగోళమంతా బద్దలయ్యేలా ఉన్న

ఈ డీజే ధ్వనులను భరించలేకపోతున్నాం..!

బ్యాండ్ మేళాలను బ్యాన్ చేసేశారు

నవరాత్రులకు డీజే సౌండ్స్ వాహనాలు

పెళ్లీ పేరంటాలకు అవే విచిత్ర ధ్వనులు

యువత మత్తులోన పడి తూగిపోతూ

డీజే మగతలో.. జగతినే మరచిపోయిరి..!

ఈ డీజే సౌండ్స్ ను నిషేధించి

సంప్రదాయ మేళాలతో ఊరేగించేటి

కొత్త చట్టాలు తీసుకు రావలసిందేనా

ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు!​


- జి.సూర్య,

సెల్‌:6281725659

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్