మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​పరిశ్రమల్లో మృత్యు ఘోష..!

3 గంటల క్రితం

​పరిశ్రమల్లో మృత్యు ఘోష..!
-ఏడాదిలో 19 ప్రమాదాలు..24 మంది మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏడాదిలో 19 ప్రమాదాలు.. 24 మంది మృతి

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : పరిశ్రమలు వస్తున్నాయి.. పెట్టుబడులు పెరుగుతున్నాయి.. ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. లాభాలతో యాజమాన్యాల జేబులు నిండుతున్నాయి.. కానీ ఈ అభివృద్ధికి ప్రధాన కారణమైన కార్మికుల శ్రమను దోచుకోవడం ఒకటైతే, ఆ కార్మికుల ప్రాణాలకు ఏమాత్రమూ భద్రత లేదన్నది వాస్తవం. యంత్రాల మోత మధ్య పనిచేస్తున్న కార్మికులకు రేపటి సూర్యుని చూస్తామన్న నమ్మకం లేదు. తిరుపతి జిల్లాలో ఏడాది వ్యవధిలో పరిశ్రమల్లో ప్రమాదాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శ్రీసిటీలోని ‘టిల్’ కంపెనీలో జరిగిన ప్రమాదంతో కలిపి 19 ప్రమాదాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 61 మంది గాయాలపాలయ్యారు. ఒకవైపు పారిశ్రామిక ప్రగతి.. మరోవైపు వరుస ప్రమాదాలు. ప్రమాదం జరిగినపుడే అధికార యంత్రాంగం హడావిడి తప్ప, నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో భద్రతను తనిఖీ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతి జిల్లాలో ఇటీవల తాజాగా జరిగిన ‘టిల్’ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గతంలో పెళ్లకూరు మండలంలో అగర్వాల్, రేణిగుంట మండలంలో నివో లింక్ మొబైల్ పరిశ్రమ, శ్రీకాళహస్తి రూరల్ పరిధిలోని సుధా సోమిని టైల్స్ పరిశ్రమలోనూ జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే తనిఖీల వైఫల్యంగా గుర్తించారు. తిరుపతి జిల్లాలో 1300 పైగా (శ్రీసిటీలో 250 కలుపుకుని) ఉన్నాయి. ఫ్యాక్టరీ ఇన్‌‌స్పెక్టర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు.

జనావాసాల మధ్యే పరిశ్రమలు ...

ముఖ్యంగా పరిశ్రమల స్థాపన నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా సత్యవేడు మండలం చెరివి ఊరిలోనే ‘టిల్’ ఫార్మా కంపెనీ ఉంది. పెళ్లకూరు మండలం ఎంఎస్ అగర్వాల్ కెమికల్ ఫ్యాక్టరీ సైతం జనావాసాల మధ్యనే ఉంది. రేణిగుంట, గాజులమండ్యం పారిశ్రామికవాడల్లోని ఫ్యాక్టరీలూ జనావాసాల మధ్యే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లోని అగ్నిమాపక శాఖలు, ఆసుపత్రులు వంటి అత్యవసర సేవలు తగిన పరికరాలతో, శిక్షణ పొందిన సిబ్బందితో సిద్ధంగా ఉండాలి.

భద్రతా చర్యలపై పలు అనుమానాలు...

ఫ్యాక్టరీల్లో నిరంతరం తనిఖీలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలుండగా, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు కేవలం 42 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఒక్కో ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో 587 ఫ్యాక్టరీలు (2023 గణాంకాలు) ఉన్నాయి.

తిరుపతి జిల్లాలో ఈ ఏడాది 2025, అక్టోబర్ తరువాత జరిగిన ప్రమాదాల వివరాలు

ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలేవి? : కందారపు మురళి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్‌‌లతో గతంలో ఉన్న భద్రతా నిబంధనలు బలహీన పడ్డాయి. పరిశ్రమల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు. అయితే లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ధోరణిని అడ్డుకోవాలి. తాజాగా టిల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.

పొంతన లేకుండా పరిశ్రమల శాఖ సమాధానాలు...

జిల్లాలో పరిశ్రమలో భద్రతా చర్యలు ఏం తీసుకున్నారు? అని ‘ప్రజాశక్తి’ పరిశ్రమల శాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా భద్రతా చర్యలు తమ పరిధి కాదని, ఇండస్ట్రీస్ చీఫ్ చూస్తారని సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీస్ చీఫ్ మురళీని ఫో‌న్‌లో సంప్రదించగా తమకు రెగ్యుల‌ర్‌గా ఒక జిల్లా ఉండదని, రెండు నెలల క్రితం తిరుపతి జిల్లాలో తనిఖీలు చేశామని, చర్యలు తీసుకోవాల్సిన పరిశ్రమలపై పరిశ్రమాధికారులకు నివేదిక ఇచ్చానని సమాధానం ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్