గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హక్కుల సాధన కోసమే ..

2 రోజుల క్రితం

For the sake of securing rights
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌
photo

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బ్యాంకింగ్‌ రంగానికి ముంచుకొస్తున్న ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొనేందుకు, హక్కులను కాపాడుకునేందుకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ ‌అజయ్‌‌కుమార్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల మూ డురోజుల సమ్మె నేపథ్యంలో ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడంతో బ్యాంకుల్లో పర్మినెంట్‌ ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయన్నారు. తాత్కాలిక, పొరుగు సేవల విధానాన్ని మరింతగా పెంచేందుకు ఈ విధానాలు దోహదపడ్డాయని తెలిపారు.

పని గంటలు పెంచుకునే స్వేచ్ఛ యజమానులకు లభించిందన్నారు. వికసిత్‌ ‌భారత్‌ - 2047 ప్రాజెక్టులో బ్యాంకులు ఎలా ఉండాలో నిర్ధారించడానికి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు ప్రతిపాదన, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యనిర్వాహకులు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లను ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకోవడం, బ్యాంకుల మూలధనంలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించాలనే నిర్ణయాలు ఆందోళనకర మన్నారు. పెట్టుబడి, నాయకత్వం ప్రైవేటుపర మయ్యాక ప్రభుత్వరంగ బ్యాంకులుగా పనిచేస్తాయా అని ప్రశ్నించారు. ఇప్పటికే బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలుగా ఇవ్వాల్సిన రూ.14 లక్షల కోట్లు ఎన్‌‌బిఎఫ్‌‌సిలకు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల కు ఆర్థిక సహాయం చేశాయని తెలిపారు. ఈ సొమ్మును ఆ కంపెనీలు అధిక వడ్డీలకు సామాన్యులకు రుణాలిచ్చి వేల కోట్ల లాభాలు దండుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల పని - జీవన సమతుల్యత కోసం వారానికి 5 రోజుల పని విధానం కావాలని డిమాండ్ పెరిగింద న్నారు. సుదీర్ఘ ఐక్య పోరాటాల ఫలితంగా 2, 4వ శనివారాలు సెలవు దినాలుగా, మిగిలిన శనివారాలు పూర్తి రోజులుగా పనిచేసేటట్లుగా 2015లో ఒప్పందం కుదిరిందని అన్నారు.

ఐదు రోజుల పని విధానాన్ని 180 రోజుల లోపల అమలు జరుపుతామని యాజమాన్యం 2024 మార్చి 8న జరిగిన వేతన ఒప్పందంలో రాసిందని, 30 నెలలు పూర్తయినా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ ఒప్పందం అమలు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పెద్దఎత్తున సమ్మె చేసినా ప్రభుత్వంలో, యాజమాన్యంలో చలనం లేదన్నారు. ద్వైపాక్షిక ఒప్పందంలో పింఛను మెరుగుదల, నూతన పింఛను విధానాన్ని రద్దుచేసి అందరికీ పాత పింఛను విధానాన్ని అమలు చేయడం, అన్ని స్థాయిలలో తగినంత ఉద్యోగ నియామకాలు, సెలవులు, ఇతర అంశాలు ఈరోజుకీ యాజమాన్యం చర్చించి పరిష్కరించలేదని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్