ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలు పరిష్కరించకుంటే 26 నుంచి నిరవధిక సమ్మె ..

29 సెప్టెంబర్, 2026

Indefinite strike from the 26th if issues are not resolved.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్ష‍ులు వై.శ్రీనివాసరావు

    కేంద్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించ కుంటే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్ష‍ులు వై.శ్రీనివాసరావు హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సంయుక్తంగా మూడు రోజుల సమ్మె చేపట్టిన నేపథ్యంలో ఆయన ‘ప్రజాశక్తి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే... బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలు కల్పించాలన్న డిమాండ్‌‌ను వెంటనే పరిష్కరించాలి. ఫెర్ఫార్మెన్స్‌ ఇన్సెంటివ్స్‌ సబ్‌ ‌స్టాఫ్‌ ‌నుంచి స్కేల్‌ 8 వరకూ అందరికీ సమానంగా బ్యాంక్‌ ‌లాభాలను బట్టి ఇవ్వాలి. ఈ అంశాలు గతంలో జరిగిన సమావేశంలో ఐబిఎ అంగీకరించాయి. బ్యాంక్‌‌ల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ వర్క్‌ ‌మెన్‌ ‌డైరెక్టర్‌, ఆఫీసర్స్‌ ‌డైరెక్టర్‌ ‌పోస్టులను భర్తీ చేయలేదు. 2010 మార్చి అనంతరం బ్యాంకు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలి. లీవ్స్‌ ‌బ్యాంక్‌‌ను నిర్వహించాలి. వైద్య బీమాను ఉద్యోగులకు చెల్లించిన విధంగా, పెన్షనర్లకు చెల్లించాలి. ఈ డిమాండ్లపై ప్రధానంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. లేనిపక్షంలో అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతాం. బ్యాంకింగ్‌ ‌రంగాన్ని గాడిలో పెట్టాలంటే బ్యాంకుల విలీనాన్ని రద్దు చేసి, గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ ‌సేవలను మరింత విస్తరించాలి. కేంద్రప్రభుత్వం 2021 నుంచి 2025 వరకూ రూ.6 లక్షల కోట్ల కార్పొరేట్‌ ‌రుణాలను మాఫీ చేసింది. ‌2025 మార్చి నాటికి 88,790 ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ బ్రాంచిల్లో 7,79,891 మంది సిబ్బంది పని చేస్తుంటే, 40,632 ప్రైవేటు బ్యాంక్‌ ‌బ్రాంచిల్లో 8,22,847 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సిబ్బందిపై పని ఒత్తిడికి ఇదే నిదర్శనం. ‌ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్