‘ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఢిల్లీలో ‘జంతర్‌మంతర్-2.0’ పేరుతో నిరవధిక నిరసనకు దిగుతాం. జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద యాంటీ నేషనల్ . భారత ప్రజాస్వామ్యానికి ఆయన పెను ప్రమాదం. జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఇవిఎంలను హ్యాక్ చేయవచ్చని, కాబట్టి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ తొలగింపులపై స్పష్టత ఇవ్వాలి. ప్రభావిత ఓటర్లకు సమర్థవంతమైన పునఃపరిశీలన అవకాశం కల్పించాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ, ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతం మాత్రమే. - సిజెపి కన్వీనర్ అభిజిత్ దీప్కే
దేశవ్యాప్త ఆందోళన
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)