శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్ణయాల్లో సగమే అమలు 

1 రోజు క్రితం

cm s
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మొత్తం నిర్ణయాలు 114…

  • అమలు చేసినవి 57 మాత్రమే

  • పరిశ్రమలు మౌలిక అభివృద్ధి శాఖల వెనుకంజ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి :

కలెక్టర్లకు సదస్సులో తీసుకున్న నిర్ణయాలు జిల్లా స్థాయిలో అమలు చేయడంలో వెనుకంజ కనిపిస్తోంది. గత కలెక్టర్ల సదస్సులో 114 అంశాలపై అమలుకు నిర్ణయాలు తీసుకుని, వాటిని తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ కలెక్టర్ల సదస్సుకు సమయానికి సగం మాత్రమే నిర్ణయాలను అమలు చేసినట్లు తేలింది. దీనిపై గురువారం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మొత్తం 114 నిర్ణయాల్లో 57 నిర్ణయాలు మాత్రమే పూర్తిస్థాయిలో అమలు జరిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మరో 27 నిర్ణయాలను పాక్షికంగా అమలు చేయగా, 30 నిర్ణయాలు ప్రోగ్రెస్ లో ఉన్నట్టు చెప్పారు అయితే ప్రోగ్రెస్ లో ఉన్నవాటి స్థాయి ఏమిటి, ఎప్పటిలోగా అవి అమల్లోకి వస్తాయని మాత్రం సుస్పష్టంగా చెప్పలేకపోతున్నారు. శాఖల వారీగా గత కలెక్టర్ల సదస్సులో నిర్ణయాలను పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో ఎనిమిది నిర్ణయాలకు గాను ఐదు అమలులోకి రాగా, ఆర్థిక శాఖలో ఆరుకిగాను ఐదు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో 8 నిర్ణయాలకు గాను ఐదు నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. రెవిన్యూ శాఖలో ఏడు నిర్ణయాలకు గాను ఆరు అమల్లోకి రాక రాగా.. నీటిపారుదల శాఖలో మాత్రం ఎనిమిది నిర్ణయాలకు గాను ఎనిమిది అమల్లోకి వచ్చినట్లు అధికారులు తమ నివేదికలో . పేర్కొన్నారు. ఇక ప్రణాళిక శాఖలో రెండు, పౌరసరఫరాల శాఖలో ఒకటి, గృహ నిర్మాణ శాఖలో రెండు నిర్ణయాలను అమలు చేయాలని గత సదస్సులో నిర్దేశించగా ఒక్కటి కూడా ఇప్పటివరకు అమల్లోకి రాలేదని నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించే పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖలో 8 నిర్ణయాలు గానం కేవలం ఒక్కటే అమల్లోకి వచ్చినట్లు తేలింది. ఉపముఖ్యమంత్రి శాఖలోనూ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఐదుకు గాను ఒకటే అమలైన అమలైంది. సాంఘిక సంక్షేమం శాఖలోకూడా ఒకటే అమల్లోకి రావడం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 8 నిర్ణయాలకు గాను మూడు మాత్రమే విశేషం. యువతకు ఉపాధి మృతి శిక్షణ పై అనునిత్యం ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నప్పటికీ ఆ శాఖలో 7 అంశాలపై నిర్ణయాలు తీసుకోగా కేవలం ఒకటి మాత్రమే అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి గత సభలో నిర్ణయాలు పూర్తి చేయడంతో పాటు ఈరోజు జరిగిన నిర్ణయాలు కూడా వేగవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్