భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా తన తాబేదారుగా ఉండేవారిని పెట్టుకునేందుకు వీలుగా బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఎంపిక చట్టంలో సవరణ చేసింది. పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత పది నెలలుగా ఎస్‌ఐఆర్ పేరుతో జరుగుతున్న ఘటనలు దేశం మొత్తం చూస్తోంది. భారతదేశం వంటి ప్రజాస్వామ్యయుత దేశంలో ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర కమిషనర్లతో సంప్రదించకుండా వాళ్ల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నియంతృత్వంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి ఆయన తాబేదారులాగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2023 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారంఈయన నియమామకం జరిగింది. మిగతా కమిషనర్లకు అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహరించారు. మిగతా కమిషనర్లు కూడా ఈయనతో పాటు సమాన హోదా ఉంటుంది. సిఇసికి ప్రత్యేకంగా లేదా ఎక్కువ హోదా లేదనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయినప్పటికీ జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ కనుసన్నలో మెలుగుతున్నారు. ఎస్‌ఐఆర్‌ను సామాన్య ఓటర్లు, మైనార్టీలు, క్రిస్టియన్లను టార్గెట్‌గా చేసుకుని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటుందనే విధంగా వ్యవహారం నడిపారు. అందుకని వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి.
- సుంకర రాజేంద్రప్రసాదు - ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ *రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్








కామెంట్‌లు (0)