మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జలసిరి... ఆవిరి

1 గంట క్రితం

irri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 06:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడు నెలల్లో గాల్లో కలిసిపోయిన 643 టిఎంసిల నీరు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎల్‌‌నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో పాటు, తగ్గని ఉష్ణోగ్రతల కారణంగా పెద్ద ఎత్తున నీరు ఆవిరవుతోంది. భూమిపై ఉన్న నీటితో పాటు, భూమి లోపల ఉండే నీరు కూడా అవిరవుతోంది. ఇలా రాష్ట్రంలో 646 టిఎంసిల నీరు మూడు నెలల కాలంలో ఆవిరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా మరి 985 టిఎంసిల నీరు కూడా వృధాగా సముద్రంలో కలిసిపోయింది. మూడు నెలల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నీరు వృద్ధా కావడం ఆందోళన కలిగిస్తోంది. సముద్రంలోకి వెళ్లిన నీటిలో ప్రధానంగా నదుల ద్వారా 984.87 టిఎంసిలు, మైక్రో బేసిన్‌ల ద్వారా మరో 1.17 టిఎంసిలు ఉన్నాయి.

మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో పాటు వేసవిని తలపించే వేడి కారణంగా భూమిలో తేమ కూడా ఆవిరిగా మారిపోయి వాతావరణంలో కలిసిపోతోందని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో మే నెల నుండి ఆగస్టు 28వ తేది వరకు

331.12 టిఎంసిల నీటి వినయోగం జరగగా అందులో అత్యధికంగా వ్యవసాయానికి 291.87 టిఎంసిల నీటిని వినియోగిస్తున్నారు. ఇది మొత్తం వినియోగంలో సుమారు 88 శాతంగా ఉంది. అలాగే పారిశ్రామిక అవసరాలకు 14.78 టీఎంసీలు, గృహావసరాలకు 24.47 టిఎంసీలు వాడుతున్నారు.

లెక్కల్లో లేని నీరు

​భూ గర్భ జలాలు,,భూమి నుండి ఆవిరైన నీరు కాకుండా భూమిలోపల మరో 240.07 టిఎంసిల నీరు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో గుర్తించాల్సిఉంది. వీటిని గుర్తిస్తే

నీటి వనరుల నిర్వహణ, వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

​నీటి లెక్కలు (టిఎంసిలు)

ఆవిరి646.13

సముద్రంలోకి ప్రవాహం986.04

​వినియోగం..

సాగునీరు291.87

పరిశ్రమలు14.78

గృహావసరాలు24.47

మొత్తం వినియోగం331.12


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్