ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరుగుతున్న పనిభారం -అమలులోకి రాని ఐదు రోజుల పని విధానం

29 సెప్టెంబర్, 2026

పెరుగుతున్న పనిభారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 01:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​

ప్రభుత్వాలు విచ్చలవిడిగా అమలు చేస్తున్న సంస్కరణల కారణంగా బ్యాంకు ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరుగుతోంది. సంస్కరణల్లో భాగంగా బ్యాంకు శాఖలను ఒకవైపు మూసివేస్తూ, లక్ష్యాలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుతున్నారు. అదే సమయంలో కొత్త ఉద్యోగుల రిక్రూట్‌‌మెంట్‌ ‌గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజలు పనిదినాన్ని అమలు చేయాలని కోరతున్నారు. ఏళ్ల తరబడి ఈ మేరకు డిమాండ్‌ ‌చేస్తున్న ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తోందే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదు. అందుకే తాజా సమ్మెలో ఐదు రోజుల పనిదినాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవులుగా ప్రకటించిన తర్వాత మిగిలిన శనివారాలు మాత్రం పని దినాలుగానే కొనసాగుతున్నాయి. 2015లో 10వ ద్వైపాక్షిక ఒప్పందం/7వ జాయింట్ నోట్‌లో రెండో, నాలుగో శనివారాలను సెలవులుగా ప్రకటించారు. మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నాయి. 2023 డిసెంబర్ లోనూ, 2024 మార్చి 8న కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోనూ దీనికి సంబంధించిన సానుకూల స్పందనే ఉంది. ప్రభుత్వం, RBI అనుమతుల తర్వాత అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ దిశలో అడుగు ముందుకుపడలేదు.

ఈ లెక్కలు చూడండి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2018 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు 93,115 శాఖలు ఉన్నాయి.

2024 జూన్ నాటికి వాటి సంఖ్య 91,313కు తగ్గింది, అంటే 2018తో పోలిస్తే 2024 జూన్ నాటికి బ్యాంకు శాఖలు 1,802 తగ్గాయి. అదే బ్యాంకుల మొత్తం రుణాలు 2018 మార్చిలో ₹61.42 లక్షల కోట్ల నుంచి 2024 మార్చిలో ₹97.73 లక్షల కోట్లకు పెరిగాయి. డిపాజిట్లు కూడా ₹82.62 లక్షల కోట్ల నుంచి ₹128.97 లక్షల కోట్లకు పెరిగాయి. ఉద్యోగుల పనితీరుకు, వారిపై పెరుగుతున్న పనిభారానికి ఈ సంఖ్యలే నిదర్శనం. ఆర్‌‌బిఐ గణాంకాల ప్రకారమే

RBI ప్రకారం 2024-25లో దేశవ్యాప్తంగా 514 జిల్లాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల 100 శాతం కవరేజీ సాధించారు. దీనర్ధం ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినా సామాన్య ఖాతాదారులకు అవసరమైన సేవలను డిజిటల్ మార్గాలు, ఎటిఎంలు అందుబాటులో ఉంటాయి. అటువంటప్పుడు ఉద్యోగులు కోరుతున్న ఐదు రోజల పనిదినాన్ని అమలు చేయడానికి మీనమేషాలెందుకు?

​

​

​

​

తేదీ శాఖలు

31-3-2018 93,115

31-3-2019 92,531

31-3-2020 92,877

31-3-2021 92,519

31-3-2022 90,207

31-3-2023 90,491

31-3-2024 91,080

30-6-2024 91,313

​

​డిజిటల్ బ్యాంకింగ్ పెరిగింది. కానీ శాఖల అవసరం పూర్తిగా పోయిందా?

అంటే డిజిటల్ సేవలు పెరిగినా భౌతిక బ్యాంకింగ్ అవసరం పూర్తిగా తొలగిపోలేదన్నది మరో వాస్తవం.

​

అప్పుడు ప్రశ్న:

లేదా శనివారం పని దినం కొనసాగించడమే బ్యాంకింగ్ సామర్థ్యానికి తప్పనిసరి అంశమా?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఉద్యోగ సంఘాలు మాత్రమే కాదు. బ్యాంకు యాజమాన్యాలు, IBA, ప్రభుత్వం కూడా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్