ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెయిర్‌‌కట్‌‌ల కోత ఎంత?

29 సెప్టెంబర్, 2026

హెయిర్‌‌కట్‌‌ల కోత ఎంత ?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 02:30 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎన్‌‌డిఎ ప్రభుత్వం వచ్చాక మొండి బాకీలను సమర్థవంతంగా వసూలు చేస్తామని ప్రకటించింది. ఆ పేరుతో 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ చట్టం తెచ్చింది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్‌సిఎల్‌టి)లను ఏర్పాటు చేసింది. కానీ అంతకు ముందు ఎన్నడూ లేనంతగా, బ్యాంకులు ఇప్పుడు పెద్ద ఎత్తున మొండి బాకీలను రద్దు చేసుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, జి నెట్‌వర్క్ వంటి ఏడు కంపెనీలు చెల్లించాల్సిన సొమ్ములో 97 శాతం రద్దయ్యింది. ఈ ప్రభుత్వ హయాంలో బ్యాంకులు రూ.18 లక్షల కోట్ల మొండి బాకీలను రద్దు చేసుకున్నట్లు అంచనా! ఈ మొతాన్ని ప్రజల అభివృద్ధి కోసమో, ఉపాధి కల్పన కోసమో ఖర్చు చేసి ఉంటే ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి! తాజా సమ్మెలో ఈ విషయాన్ని కూడా బ్యాంకు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

​

​మొండి బాకీలను వసూలు చేయడానికి బలమైన చట్టం అవసరమనే ఉద్దేశంతో 2016లో ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబిసి )ను తీసుకొచ్చారు. నేసనల్‌ ‌కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌‌సిఎల్‌‌టి) ద్వారా పెద్ద కంపెనీల దివాలా కేసులను కాలపరిమితిలో పరిష్కరించి, బ్యాంకులు కోల్పోయిన డబ్బును వీలైనంత ఎక్కువగా తిరిగి రాబట్టడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. కానీ ఆచరణలో జరిగింది దానికి భిన్నం!

, బ్యాంకులకు అసలు బకాయిల్లో అత్యంత తక్కువ మొత్తమే వచ్చిన సంఘటనలే ఎక్కువ! ‘హెయిర్‌‌కట్‌’గా పిలిచే ఈ పద్దతిలో బ్యాంకుకు భారీ నష్టాలు మిగులుతున్నాయి.

ఐబిసి ప్రారంభ దశలో నే 12 పెద్ద ఖాతాల్లోనే భారీ మొత్తాల రుణాలు చిక్కుకున్నాయి. 2018 జూలై నాటికి ఈ 12 కంపెనీలకు సంబంధించి మొత్తం అడ్మిట్‌ చేసిన క్లెయిమ్‌లు రూ.3.27 లక్షల కోట్లు. అందులో భూషణ్‌ స్టీల్‌, ఎలక్ట్రోస్టీల్‌ కేసులు అప్పటికే పరిష్కారమయ్యాయి.

​

ఈ పట్టిక చూడండి

​

| కంపెనీ | పరిష్కారం జరిగిన సంవత్సరం | మొత్తం క్లెయిమ్‌ | బ్యాంకులకు వచ్చింది | హెయిర్‌కట్‌ |

(రు. కోట్లలో) (రు. కోట్లలో) (శాతం )

| ------------------------------------------------ | ------------------------: | --------------------: | --------------------------------------: | -----------: |

| భూషణ్‌ స్టీల్‌ 2018 57,505 35,571 36.1

| ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ 2018 13,958 5,320 61.9

| మోనెట్‌ ఇస్పాత్‌ 2018 11,080 2,892 73.9

| జ్యోతి స్ట్రక్చర్స్‌ 2018 8,195 3,691 55.0

| ఆలొక్‌ ఇండస్ట్రీస్‌ 2019 30,242 5,052 83.3%

| వీడియోకాన్‌ గ్రూప్‌ 2021 64,838 2,962 95.4%

| రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌

తదితర గ్రూప్‌ కంపెనీలు 2020 47,000 23,000 | 50%

జీ...ఎస్సెల్‌ మరో ఉదాహరణ

ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీ/ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవహారం కూడా ఇటువంటిదే. లో రూ.22,006.57 కోట్ల బకాయిలకు గాను రూ.6.25 కోట్ల చెల్లిస్తే చాలని ఆగస్టు 25 ఎన్‌‌ససిఎల్‌‌టి పేర్కొంది. అంటే రూ.100కు సుమారు 3 పైసల రికవరీ మాత్రమే. దాదాపు 99.97 శాతాన్ని హెయిర్‌ ‌కట్‌‌గా పేర్కొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా దుమారంరేగింది. సెప్టెంబర్‌ ఒకటిన ఐదుగురు సభ్యుల ఎన్‌‌సిఎల్‌‌టి బెంచ్‌ ఆ ఆమోదాన్ని నిలిపివేసి కేసును మళ్లీ విచారించాలని ఆదేశించింది.

​

రైట్‌ఆఫ్‌లు కూడా వేల కోట్లలోనే

బ్యాంకులను నష్టాల బాటన నడిపిస్తున్న వాటిలో హెయిర్‌‌కట్‌ ఒకటి కాగా, రైట్‌ ఆఫ్‌‌లు మరో కీలకమైన అంశం,.

​

2020-21 నుంచి 2024-25 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.5,80,550 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి. అదే కాలంలో రైట్‌ఆఫ్‌ చేసిన ఖాతాల నుంచి రూ.1,64,830 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి.

​

| సంవత్సరం | PSB రైట్‌ఆఫ్‌ | రికవరీ |

రు. కోట్లు రు. కోట్లు

| -------- | ---------------: | ---------------: |

| 2020-21 | 1,31,894 | 24,781 |

| 2021-22 | 1,15,536 | 24,739 |

| 2022-23 | 1,27,238 | 35,378 |

| 2023-24 | 1,14,622 | 37,369 |

| 2024-25 | 91,260 | 42,563 |

| మొత్తం | 5,80,550 | 1,64,830 |

​

​

రైట్‌ ఆఫ్‌ ‌చేయడమంటే బ్యాలెన్స్‌ ‌షీట్‌ ‌ల నుండి మాత్రమే తొలగిస్తామని, ఆ తరువాత కూడా వసూలు ప్ర్రకియ కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ ఆచరణలో అది నామమాత్రంగాను ఉంటోంది. ప్రజల డిపాజిట్లతో నడిచే బ్యాంకులు పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇస్తాయి. ఆ రుణాలు మొండి బాకీలుగా మారినప్పుడు ఐబిసి, ఎన్‌‌సిఎల్‌‌టిల పేర్లతో నామమాత్రంగా కుదుర్చుకుంటున్న ఒప్పందాలు బ్యాంకులను సంక్షోభం దిశగా నడిపిస్తున్నాయి.

ఈ ప్రక్రియలో కొన్నికేసుల్లో రూ.100 బకాయికి రూ.38 మాత్రమే వసూలు కాగా, ఒక కేసులో 17 రూపాయలు మాత్రమే వసూలైంది. వీడియోకాన్‌ ‌విషయంలో వందకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేశారు.

మరో కేసులో రూ.100కు రూ.17 మాత్రమే వచ్చాయి.

ఉద్యోగులపై పెరుగుతున్న భారం

ఈ పరిస్థితి కూడా ఉద్యోగుల పనిని మరింత భారంగా మారుస్తోంది. రుణాల వసూళ్లకు సిబ్బంది పనితీరుకు లింకు పెడుతున్నారు. క్రెడిట్‌ అప్రైజల్‌, డాక్యుమెంటేషన్‌, మానిటరింగ్‌, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ ‌ల పేరిట పని భారాన్ని అనేక రకాలుగా మోపుతున్నారు. . దీని వల్ల ఉద్యోగుల బాధ్యతలు కేవలం ‘కస్టమర్‌కు రుణం ఇవ్వడం’ నుంచి ‘రుణం సురక్షితంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించడం.. వసూళ్లు చేయడం’ విస్తరిస్తున్నారు.

​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్