దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లోకి భారత్- ‘ఎ’ జట్టు దూసుకెళ్లింది. అఫ్గానిస్తాన్-ఎతో బుధవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ సేన నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్టు 36.5ఓవర్లలో 218పరుగులకు ఆలౌటైంది. ప్రియాన్ష్ ఆర్య(58), తిలక్ వర్మ (59), కుమార్ కుశాగ్ర (58) అర్ధ సెంచరీలకి తోడు వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30), విప్రాజ్ నిగమ్ (30) పరుగులతో రాణించారు. ఇక బౌలింగ్ లో నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ రెండు, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఫైనల్‌కు ఇండియా-ఎ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)