ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

BAN vs AUS, 2nd Test: బంగ్లాపై ఆసీస్‌ ఘన విజయం

1 గంట క్రితం

AUS.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 64 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పదునైన బౌలింగ్‌తో 95 పరుగులకే కుప్పకూల్చింది. స్టార్క్ మరోసారి విజృంభించి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేసింది. దీంతో బంగ్లాపై ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్‌ ఆరు వికెట్లు తీశాడు. నాథన్ లయన్ 3, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. 
ఓవర్‌నైట్ 165/8 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు కామెరూన్ గ్రీన్ (67), నాథన్ లయన్ (32*) విలువైన పరుగులు జోడించారు. తొమ్మిదో వికెట్‌కు 38 పరుగులు రాబట్టారు. గ్రీన్‌ ఔటైనా సరే.. జోష్ హేజిల్‌వుడ్‌తో (6) కలిసి లయన్‌ పదో వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ (7/48) ప్రభావం చూపించాడు. తస్కిన్, తైజుల్ ఇస్లామ్, మెహిదీ తలో వికెట్ తీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్