మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌‌బై

30 జులై, 2026

rahane
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి: టీమిఇండియా ఆటగాడు అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత వీడియోను గురువారం షేర్ చేశాడు. ఆస్ట్రేలియాపై 2021లో బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని టీమిండియాకు అందించిన కెప్టెన్‌గా అజింక్య రహానే అద్భుత ట్రాక్‌ ‌రికార్డు రహానే సొంతం. ‘‘ప్రతి దానికీ ఆరంభం.. ముగింపు ఉంటాయనేది జీవిత సత్యం. సరైన సమయం వచ్చినప్పుడు వాటిని గౌరవించి ముందుకు సాగాలి. నేను కూడా నా బ్యాటింగ్‌ సమయంలో టైమింగ్‌పైనే ఆధారపడ్డాను. అలాగే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 20 ఏళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ నుంచి భారత జట్టుకు ఆడే వరకూ ప్రతి క్షణం గర్వంగా ఫీలయ్యా. ఇక ఈ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నా’’ అని రహానే ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘బిసిసిఐ, ముంబయి క్రికెట్ అసోసియేషన్‌, సహచరులు, కోచ్‌లు, ఐపిఎల్‌ ఫ్రాంచైజీలు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా నాకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతిసారి విజయం కోసమే బరిలోకి దిగా.. క్యాప్ నంబర్ 278కి గుడ్‌బై’’ అని రహానే వీడియోలో వ్యాఖ్యానించాడు. 12ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌‌లో 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. 90 వన్డేల్లో 2,962 పరుగులు చేయగా.. మూడు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు, 20 టి20ల్లో 375 పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో 212 మ్యాచులకుగాను 5,367 పరుగులు చేశాడు. రహానే సారథ్యంలోని కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ 2026 ఐపిఎల్‌ ‌సీజన్‌‌లో 7వ స్థానానికే పరిమితమై నిరాశపరిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్