శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజింబాబ్వేకు మరో గెలుపు

11 గంటల క్రితం

zim.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నమీబియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం

  • ముక్కోణపు టి20 సిరీస్‌

విండ్‌‌హోక్‌(నమీబియా): ముక్కోణపు టి20 సిరీస్‌ ‌ఫైనల్‌‌కు చేరువలో జింబాబ్వే నిలిచింది. నమీబియా క్రికెట్‌ ‌గ్రౌండ్‌‌లో గురువారం జరిగిన చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో జింబాబ్వే జట్టు 5వికెట్ల తేడాతో ఆతిథ్య నమీబియాపై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఎరాస్మస్‌(88నాటౌట్‌; 48బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌‌కి తోడు అలెగ్జాండర్‌(29) బ్యాటింగ్‌‌లో రాణించారు. జింబాబ్వే బౌలర్లు మతిమణి, ఎవాన్స్‌‌కు రెండేసి, ముజరబ్బాని, సికిందర్‌ ‌రాజాకు ఒక్కో వికెట్‌ ‌దక్కాయి. అనంతరం జింబాబ్వే మిడిలార్డర్‌ ‌బ్యాటర్‌ ఇన్నోసెంట్‌ ‌కాలా(72; 42బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు)కి తోడు కెప్టెన్‌ ‌సికిందర్‌ ‌రాజా(29), బెన్నెట్‌(22) బ్యాటింగ్‌‌లో రాణించి మరో 11 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌‌ను ముగించారు. నమీబియా బౌలర్లు ట్రంపెల్మన్‌‌కు రెండు, బ్రస్సెల్‌, స్మిట్‌, ఎటాన్‌‌కు ఒక్కో వికెట్‌ ‌దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ఇన్నోసెంట్‌ ‌కాలాకు లభించగా.. దక్షిణాఫ్రికా(+1.38), జింబాబ్వే(-1.00) 4పాయింట్లతో టాప్‌-2లో నిలువగా.. నమీబియా(-0.09రన్‌‌రేట్‌)‌ 2పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. నమీబియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం జరిగే చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో నమీబియా గెలిస్తే సమీకరణలు మారనున్నాయి. ఇప్పటికే టాప్‌-2లో ఉన్న రెండుజట్లే ఫైనల్లో తలపడతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్