శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: మెన్స్‌ క్రికెట్‌ శ్రీలంకకు కాంస్యం

18 గంటల క్రితం

sl vs ban.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 09:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌పై 63 పరుగుల విజయం

ఆసియా క్రీడలు–2026 పురుషుల క్రికెట్‌లో శ్రీలంక కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌ను 63 పరుగుల తేడాతో ఓడించి మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. థరిందు రత్నాయకే (65) అర్ధశతకంతో రాణించగా, సహన్ అరచ్చిగే 33, అషెన్ బండార 18 పరుగులు చేశారు. మిగాతా బ్యాటర్లు లసిత్ క్రూస్‌పుల్లే(2), సినీత్ జయవర్దన 3, సోహన్ డి లివెరా (6), నువానీడు ఫెర్నాండో1,దుషన్ హేమంత2, వనుజా సహన్ 5, విజయకాంత్ వియాస్కాంత్ 2 పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు : మహేదీ హసన్ 2, అలిస్ అల్ ఇస్లాం 1, రిషాద్ హొస్సేన్ 1, సైఫ్ హసన్2, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీశారు...

బంగ్లా బ్యాటింగ్‌: సైఫ్ హసన్(0), తాంజిద్ హసన్ తమీమ్ (0), లిట్టన్ దాస్(0),మహేది హసన్ (0) డకౌట్ అయ్యారు. పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 20, తౌహిద్ హృదయ్ 11, యాసిర్ అలీ 21, మహేదీ హసన్0, రిషద్ హొస్సేన్ 10, నసుమ్ అహ్మద్ 34, అల్స్ట్ ఇస్లాఫ్ 26 తక్కువ పరులు చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. శ్రీలంక బౌలర్లలో : నువాన్ తుషార, తరిందు రత్నాయకే, విజయకాంత్ వియాస్కాంత్, వనుజా సహన్ తలో రెండు వికెట్లు తీయగా.. సహన్ అరాచ్చిగ్ 1 దుషన్ హేమంత 1 వికెట్లు తీశారు. దీంతో బంగ్లాదేశ్‌ను 63 పరుగుల తేడాతో ఓడించిన శ్రీలంక కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్