దక్షిణాఫ్రికా లక్ష్యం 421 పరుగులు
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా ముందు 421పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. ఓవర్‌నైట్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 314 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 284పరుగులకు ఆలౌట్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 390 పరుగులు చేయడంతో సఫారీ జట్టు ముందు భారీ లక్ష్యం నిలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో మెరిసిన రెన్ షా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులతో రాణించాడు. ఓపెనర్ మాడీసన్(48) తృటిలో అర్ధసెంచరీని మిస్ చేసుకోగా.. వెబ్‌స్టర్(39), లబూషేన్(37) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నోకియా, మహరాజ్‌కు రెండేసి, యాన్సెన్, హార్మర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. దీంతో నాలుగో రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్ మొదటి వికెట్ సాధించింది. 421 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్ రియాన్ రికెల్టన్(2)ను హేజిల్‌వుడ్ వెంటనే వెనక్కి పంపాడు. కడపటి వార్తలందే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 41ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మార్క్‌క్రమ్(45) పోరాడుతున్నాడు. ఆసీస్ బౌలర్లు హేజిల్‌వుడ్‌కు రెండు, కమిన్స్, రెన్‌షాకు ఒక్కో వికెట్ దక్కాయి.







కామెంట్‌లు (0)