శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నిప్పులు చెరిగిన స్టార్క్‌.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్‌

18 గంటల క్రితం

starc.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 09:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కూలిపోయింది. మాక్నాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌పై మిచెల్‌ స్టార్క్‌ తన బౌలింగ్‌తో విరుచుకుపడటంతో లి ఇన్నింగ్స్‌లో కేవలం 64 పరుగులకే ఆలౌటైంది. తొలి నాలుగు వికెట్లనూ స్టార్క్‌ పడగొట్టడంతో బంగ్లాదేశ్‌ 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ షద్మాన్‌ (0)ను తొలి బంతికే పెవిలియన్‌కు పంపిన స్టార్క్‌.. మరో ఓపెనర్‌ తన్జిద్‌ (0)ను కూడా డకౌట్‌ చేశాడు. మోమినుల్‌ హక్‌ (9), కెప్టెన్‌ షాంటో (0), ఔట్‌ చేశాడు. మరోవైపు ముస్తాఫిజుర్‌ రహీమ్‌ (5)ను కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా పతనం మరింత వేగమైంది. లిటన్‌ దాస్‌ (5)ను స్టార్క్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. కేవలం 22 బంతుల్లోనే స్టార్క్‌ ఐదు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా ఆరు వికెట్లు తీసి ఆ జట్టు పతనంలో కీలక పాత్ర పోషించాడు. కమిన్స్‌ మూడు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశారు.

21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ కనీసం 30 పరుగులైనా చేస్తుందా అన్న పరిస్థితి నెలకొంది. ఈ దశలో మెహిదీ హసన్‌ (11), హసన్‌ మహ్ముద్‌ (10) స్వల్ప భాగస్వామ్యంతో జట్టును కొంత ఆదుకున్నారు. అయితే తస్కిన్‌ అహ్మద్‌ (1) కూడా త్వరగా వెనుదిరగడంతో బంగ్లా కష్టాలు కొనసాగాయి. చివర్లో షోరిఫుల్‌ ఇస్లామ్‌ (14 నాటౌట్‌), తౌజుల్‌ ఇస్లామ్‌ (11 నాటౌట్‌) ధాటిగా ఆడి బంగ్లాదేశ్‌ స్కోరును 64 పరుగులకు చేర్చారు. చివరి వికెట్‌కు వీరిద్దరూ 25 పరుగులు జోడించడం ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్‌ 64 పరుగులకే ఆలౌటై తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్