భారత్‌తో జరిగే ఏకైక టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ టామీ బ్యూమాంట్ ప్రకటించింది. 2009లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్యూమౌంట్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2017లో స్వదేశంలో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ టైటిల్ గెలవడంలో బ్యూమాంట్ కీలక పాత్ర పోషించింది. 2023 మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 208 పరుగులు చేసి మహిళల టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున తొలి డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఇద్దరు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లలో బ్యూమౌంట్ ఒకరు. వన్డేల్లో అత్యధికంగా 12 సెంచరీలు, టీ20ల్లో సెంచరీతోపాటు 37 అర్ద సెంచరీలు నమోదు చేసింది. దాదాపు 17 ఏళ్ల పాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది.
Print Editionఅంతర్జాతీయ క్రికెట్‌కు బ్యూమౌంట్ గుడ్‌బై
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)