న్యూఢిల్లీ : ఐపిఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ( సిఎస్‌కె) ఎక్స్‌లో ప్రకటించింది. ఇప్పటికే ధోనీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలుపలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుండి తమ టీమ్ మెంటర్‌గా బాధ్యలు చేపట్టనున్నారని సిఎస్‌కె తెలిపింది. దీంతో 2008లో మొదలైన ప్రయాణానికి తెరపడింది. 2008లో జరిగిన మొదటి ఐపిఎల్ ఆటగాళ్ల వేలంలో ధోనీ సుమారు రూ.14.1కోట్లకు (1.5 మిలియన్ డాలర్లు) సిఎస్‌కె కొనుగోలు చేసింది. అప్పట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. జట్టును ఐదు ఐపిఎల్ టైటిల్స్, రెండు చాంపియన్ లీగ్ టీ 20 ట్రోఫీలను గెలిపించడమే కాకుండా, 5,314 పరుగులతో సూపర్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచారు. 272 మ్యాచ్‌లతో ఈ ఫ్రాంచైజీ తరపున అత్యధిక మ్యాచ్‌లు అడిన క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.








కామెంట్‌లు (0)