ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహాంకాంగ్‌ సిక్సెస్‌లో టీమిండియాకు నిరాశ

17 గంటల క్రితం

Hong Kong Sixes 2026
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • యుఎఇ, ఇంగ్లాండ్‌ జట్ల చేతిలో ఓటమి

హాంకాంగ్‌: హాంకాంగ్‌ సిక్సెస్‌-2026లో భారత జట్టు హ్యాట్రిక్‌ ఓటములతో నిరాశపరిచింది. తొలిరోజు పాకిస్తాన్‌ చేతిలో 4వికెట్ల తేడాతో ఓడిన భారత్‌.. రెండోరోజైన శనివారం యుఎఇ, ఇంగ్లాండ్‌ జట్ల చేతిలో చిత్తుగా ఓడి సెమీస్‌ రేసునుంచి నిష్ర్కమించింది. గ్రూప్‌-సిలో ఉన్న భారత్‌ శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో యుఎఇ చేతిలో 6వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత భారత్‌ నిర్ణీత 6ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని యుఎఇ 4.2ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 97 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 3 పరుగుల తేడాతో ఓడింది. తొలుత ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేస్తే.. భారత్‌ నిర్ణీత 6ఓవర్లు ముగిసేసరికి 4వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి ఓడింది. హ్యాట్రిక్‌ ఓటములతో టోర్నీ నుంచి నిష్ర్కమించిన భారత్‌.. ఆదివారం 11వ స్థానం కోసం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ​హాబ్సన్‌ 11 బంతుల్లో అర్ధసెంచరీ హాంగ్ కాంగ్ సిక్స్సెస్ 2026 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదిక‌గా జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్‌లో యూఏఈను 53 ప‌రుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. దీంతో ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీ ఫైన‌ల్‌కు ఆసీస్ దూసుకెళ్లింది. ఈ సెమిస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాట‌ర్లు మ్యాక్స్ బ్రయంట్, నిక్ హాబ్సన్ మ‌రోసారి విధ్వంసం సృష్టించారు. బ్రయంట్ కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60 పరుగులు చేయగా.. హాబ్సన్ 11 బంతుల్లో (4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 రన్స్‌) అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఛేదనలో భాగంగా యుఎఇ 5.3ఓవర్లలో 86పరుగులకు ఆలౌటైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్