బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionDuleep Trophy : ఫైనల్‌కు ఈస్ట్ జోన్

1 రోజు క్రితం

mukesh-3.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 05:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సెంట్రల్‌ జోన్‌పై 4వికెట్ల తేడాతో గెలుపు

  • దులీప్‌ ‌ట్రోఫీ సెమీఫైనల్స్‌

బెంగళూరు: దులీప్‌ ‌ట్రోఫీ ఫైనల్‌‌కు ఈస్ట్‌‌జోన్‌ ‌జట్టు ప్రవేశించింది. బిసిసిఐ సెంట్రల్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-1లో సెంట్రల్‌ ‌జోన్‌ ‌నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్‌‌జోన్‌ ‌జట్టు 6వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. సెంట్రల్‌ ‌జోన్‌ ‌జట్టు ఓవర్‌‌నైట్‌ ‌స్కోర్‌ 3‌వికెట్ల నష్టానికి 45 పరుగులతో మంగళవారం మూడోరోజు ఆటను కొనసాగించి ముఖేష్‌ ‌కుమార్‌(4/44), మహ్మద్‌ ‌షమీ(3/56) దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌‌లో 158పరుగులకే కుప్పకూలింది. అమన్‌(41)‌కి తోడు అర్షాద్‌ ‌ఖాన్‌(25), హర్ష్‌ ‌దూబే(24), రింకు సింగ్‌(20)కి తోడు అర్యాన్‌(10) ‌మాత్రమే రెండంక్కెల స్కోర్‌ ‌చేశారు. కునాల్‌(2), జుయల్‌(8), కెప్టెన్‌ ‌రజత్‌ ‌పటీధర్‌(5), యశ్‌ ‌రాథోడ్‌(5) ‌సింగిల్‌ ‌డిజిట్‌‌కే పరిమితమయ్యారు. 159 పరుగుల ఛేదనలో ఈస్ట్‌‌జోన్‌ ‌ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌(24), వైభవ్‌ ‌సూర్యవంశీ(40)కి తోడు కుమార్‌ ‌కుషగ్ర(22), కెప్టెన్‌ ఇషాన్‌ ‌కిషన్‌(39‌నాటౌట్‌) ‌రాణించి మ్యాచ్‌‌ను 39.3ఓవర్లలోనే ముగించారు. ఇషాన్‌ ‌కిషన్‌(39‌నాటౌట్‌), షమీ(8) చివర్లో రాణించడంలో ఈస్ట్‌‌జోన్‌ 6వికెట్లు కోల్పోయి 162పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. సెంట్రల్‌ ‌జోన్‌ ‌బౌలర్లు హర్ష్‌ ‌దూబే(4/53)కి తోడు సురాన్స్‌ ‌జైన్‌, యశ్‌ ‌ఠాకూర్‌ ఒక్కో వికెట్‌‌తో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌ముఖేష్‌ ‌కుమార్‌‌కు లభించింది. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.

‌హోరాహోరీగా నార్త్‌-‌సౌత్‌జోన్‌ ‌మ్యాచ్‌..

బిసిసిఐ సెంట్రల్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌-2లో సౌత్‌‌జోన్‌, నార్త్‌‌జోన్‌ ‌జట్ల మధ్య జరుగుతున్న మరో సెమీఫైనల్‌ ‌మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడోరోజు నార్త్‌‌జోన్‌ ‌జట్టు 139పరుగుల ఆధిక్యతలో నిలిచింది. నిషాంత్‌ సిందు(20), కంబోజ్‌(29) బ్యాటింగ్‌‌లో రాణించారు. అంతకుముందు సౌత్‌జోన్‌ ‌జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 312పరుగులు చేయగా.. నార్త్‌‌జోన్‌ 195పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌత్‌‌జోన్‌‌కు 117పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ‌ప్రారంభించిన నార్త్‌‌జోన్‌ ‌జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి 7 వికెట్ల నష్టానికి 256పరుగులు చేసి 139 పరుగుల ఆధిక్యతను సంపాదించింది. సనత్‌ ‌సాంగ్వాన్‌(78), ఆయుశ్‌ ‌దోసేజే(52) అర్ధసెంచరీతో రాణించారు. చివర్లో నిషాంత్‌, కంబోజ్‌ ‌క్రీజ్‌‌లో కుదురుకొని వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సౌత్‌‌జోన్‌ ‌బౌలర్లు నదీశ్‌, సాయి తేజ, శ్రేయాస్‌ ‌గోపాల్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్