శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫైనల్‌కు ఇంగ్లండ్‌ మహిళలు

1 గంట క్రితం

england
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెమీస్‌లో దక్ష‍ిణాఫికాపై గెలుపు

లండన్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవేశించింది. కెన్నింగ్టన్‌ వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టు 40 పరుగుల తేడాతో దక్ష‍ిణాఫ్రికా మహిళలపై ఘన విజయం సాధించదింది. సెమీస్‌లో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో దక్ష‍ిణాఫ్రికాను నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఐదోసారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి ఇంగ్లండ్‌ మహిళల జట్టు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో స్కీవర్‌ బ్రంట్‌(75), హీథర్‌ నైట్‌(58) అర్ధసెంచరీలతో రాణించగా.. బౌలింగ్‌లో లారెన్‌ బెల్‌, ఛార్లోటే డీన్‌ రెండేసి వికెట్లతో రాణించి దక్ష‍ిణాఫ్రికాను కట్టడి చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్కీవర్‌ బ్రంట్‌కు దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్లో 6సార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఆతిథ్య జట్టు తలపడనుంది. టి 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఫైనల్. గతంలో 2009, 2012, 2014, 2018లో ఫైనల్ ఆడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్