దుబాయ్: మహిళల ఆసియాకప్ సెమీఫైనల్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. శ్రీలంక మహిళలతో శుక్రవారం జరిగిన సెమీస్‌లో కేవలం 36బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 47పరుగులతో అజేయంగా నిలిచింది. జుల్ఫికర్(24), ఫరోజా(21) కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేశారు. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మునీబా అలీ(2) నిరాశపరిచినా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ మోస్తరు ఇన్నింగ్స్ (47 నాటౌట్) ఆడటంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చివర్లో తుబా హసన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. అయేషా జాఫర్ (7), సదాఫ్ షమాస్ (8) సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమారీ ఆటపట్టు, చముడి ప్రబోదా తలో 2 వికెట్లు తీయగా.. సుగందిక కుమారి ఒక వికెట్ పడగొట్టింది.
ఫాతిమా మెరుపులు
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)