ఢాకా: షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లఓ లో బంగ్లాదేశ్ 272 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండోరోజు వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లఓ 245పరుగులకు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు రెండోరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 79 పరుగులే చేసింది. ఆ జట్టు ఇప్పటికి 106 పరుగు ఆధిక్యతను మాత్రమే సంపాదించగా.. ఇరుజట్లను గెలుపు ఊరిస్తోంది. ఓవర్‌నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 134 పరుగులతో శుక్రవారం రెండోరోజు ఆటను కొనసాగించిన విండీస్ జట్టును చందర్‌పాల్(56) అర్ధసెంచరీకి తోడు గ్రీవ్స్(46), కెప్టెన్ రోస్టన్ ఛేస్(43నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరి నిష్ర్కమణ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బిషప్(15), జోసెఫ్(4), వర్రికన్(0), సీలెస్(0) నిరాశపరిచారు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ 82.5ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. బంగ్లాదేశ్ బౌలర్లు నయీమ్ హసన్‌కు నాలుగు, తైజుల్ ఇస్లామ్, మెహిదీ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో బంగ్లాదేశ్‌కు 27పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను విండీస్ కెప్టెన్ ఛేస్(3/25), వర్రికన్(2)19) కట్టడి చేశారు. దీంతో బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా పెవీలియన్‌కు క్యూ కట్టారు. క్రీజ్‌లో జాకెర్ అలీ(18), నయీమ్ హసన్(18) ఉన్నారు.
Print EditionBAN vs WI, 1st Test: ఉత్కంఠగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ తొలి టెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)