గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐపీఎల్‌లో సీఎస్‌కే–సన్‌రైజర్స్ మధ్య నలుగురు ఆటగాళ్ల ట్రేడ్ డీల్

1 గంట క్రితం

Four-player trade deal between CSK and Sunrisers in IPL
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 10:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబై: ఐపీఎల్‌(IPL)లో ప్లేయ‌ర్ రిటెన్ష‌న్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి. ఇరు జ‌ట్ల మ‌ధ్య న‌లుగురు ప్లేయ‌ర్లు మార‌నున్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండ‌ర్ లియాం లివింగ్‌స్టోన్‌, ఆస్ట్రేలియా బౌల‌ర్ జాక్ ఎడ్వ‌ర్డ్స్ ఇక హైద‌రాబాదీ జ‌ట్టును వీడి చెన్నై జ‌ట్టుతో చేర‌నున్నారు. దీనికి బ‌దులుగా చెన్నై జ‌ట్టులోని పేస‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్‌, మ‌రో బౌల‌ర్ నాథ‌న్ ఎల్లిస్ ఇక వ‌చ్చే సీజ‌న్ నుంచి హైద‌రాబాద్ జ‌ట్టులో క‌ల‌వ‌నున్నారు. న‌లుగురు ప్లేయ‌ర్ల ట్రేడ్ డీల్‌కు చెందిన ప్ర‌క‌ట‌న‌ను ఐపీఎల్ రిలీజ్ చేసింది. అయితే ఆల్‌రౌండ‌ర్ లివింగ్‌స్టోన్ సుమారు 7 కోట్లు త‌క్కువ‌కే చెన్నై జ‌ట్టుతో క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు 13 కోట్లు పెట్టి లివింగ్‌స్టోన్‌ను ఖ‌రీదు చేసిన విష‌యం తెలిసిందే. ఎడ్వ‌ర్డ్స్ మూడు కోట్ల‌కు చెన్నైతో చేరాడు. ఖ‌లీల్‌ను 4.8 కోట్ల‌కే స‌న్‌రైజ‌ర్స్ సొంతం చేసుకున్న‌ది. వాస్త‌వానికి 2018 నుంచి 2021 వ‌ర‌కు ఖ‌లీల్ హైద‌రాబాద్‌కు ఆడాడు. కానీ 2025 సీజ‌న్‌లో చెన్నై త‌ర‌పున ఆడిన అత‌ను 14 వికెట్లు తీసుకున్నాడు. ఫాస్ట్ బౌల‌ర్ ఎల్లిస్ 2 కోట్ల‌కే స‌న్‌రైజ‌ర్స్‌తో చేరాడు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసుకునేందుకు అనేక ఫ్రాంచైజీలు పోటీప‌డుతున్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా పాండ్యాపై దృష్టి పెట్టిన‌ట్లు తెలిసింది. కోల్‌క‌తా, రాజ‌స్థాన్ జ‌ట్లు కూడా హార్దిక్ పాండ్యా కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న విష‌యం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్