- దులీప్ ట్రోఫీకి జట్టు ప్రకటన.
ముంబయి: వెస్ట్ జోన్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) సోమవారం ప్రకటించిన జట్టులో ముంబయి చెందిన ఏడుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. సామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్ తనుష్ కోటియన్, పృథ్వీ షా, సర్పరాజ్ ఖాన్ తుది 15మందితో కూడిన వెస్ట్‌జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. హర్విక్ దేశాయ్, ఉర్విల్ పటేల్ వికెట్ కీపర్ల కోటాలో ఎంపిక కాగా.. సౌరాష్ట్రకు చెందిన హర్విక్, గుజరాత్‌కు చెందిన ఉర్విల్‌లకు తొలిసారి వెస్ట్‌జోన్ జట్టులో చోటు లభించింది. జట్టు: గైక్వాడ్(కెప్టెన్), పృథ్వీ షా, హర్విక్ దేశాయ్, ఉర్విల్(వికెట్ కీపర్లు), శివలిక్, ముషీర్, సర్ఫరాజ్ ఖాన్, జైమీత్ పటేల్, సిద్ధార్ద్ దేశాయ్, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, అతిత్ సేథ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి.








కామెంట్‌లు (0)