సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రీవ్స్‌, ఛేస్‌ అర్ధసెంచరీలు

3 గంటల క్రితం

wi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వెస్టిండీస్‌ 344

ట్రినిడాడ్‌: పాకిస్తాన్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో వెస్టిండీస్‌ ‌గౌరవప్రద స్కోర్‌ ‌దిశగా దూసుకెళ్తుంది. రెండోరోజైన సోమవారం వెస్టిండీస్‌ ‌జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ ‌బ్యాటర్లు జస్టిన్‌ ‌గ్రీవ్స్‌(73), రోస్టన్‌ ‌ఛేస్‌(70) అర్ధసెంచరీలతో రాణించారు. ఓవర్‌ ‌నైట్‌ ‌స్కోర్‌ 74ఓవర్లలో 5‌వికెట్ల నష్టానికి 239పరుగులతో రెండోరోజు ఆటను ప్రారంభించిన విండీస్‌‌ను పాకిస్తాన్‌ ‌బౌలర్లు దెబ్బకొట్టారు. సాజిద్‌ ‌ఖాన్‌ నాలుగు వికెట్లతో రాణించగా.. మహ్మద్‌ అలీ, ఉబైద్‌ ‌షా, ఉస్మాన్‌ ‌రెండేసి వికెట్లతో రాణించి విండీస్‌ను భారీస్కోర్‌ ‌చేయకుండా నిలువరించారు. మరోవైపు విండీస్‌ ‌బ్యాటర్లు గ్రీవ్స్‌, ఛేస్‌ ఔటయ్యాక ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. తొలి టెస్ట్‌‌లో విండీస్‌ ‌జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్తాన్‌‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్