కేరళపై ఆంధ్ర గెలుపు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ
ఛండీగడ్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బింద్రా పంజాబ్ స్టేడియంలో బుధవారం జరిగిన గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 29 పరుగుల తేడాతో కేరళపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీస్కోర్ చేసింది. సీరమ్ వెంకట రాహుల్(64), షేక్ రషీద్(60) అర్ధసెంచరీలకి తోడు అశ్విన్ హెబ్బర్(37) బ్యాటింగ్‌లో రాణించారు. కేరళ బౌలర్లు ఎండి నిదీష్‌కు మూడు, బిజు నారాయణన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం కేరళ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అబ్దుల్ బాసిత్(70) అర్ధసెంచరీకి తోడు గోవింద్(36), షరాఫుద్దీన్(27) బ్యాటింగ్‌లో రాణించారు. ఆంధ్ర బౌలర్లు కలిదిండి రాజు, కెవి శశికాంత్‌కు రెండేసి, సత్యనారాయణ రాజుకు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సీరమ్ వెంకట రాహుల్‌కు లభించింది.
ఇక గ్రూప్ డి-లో హైదరాబాద్ జట్టు మరో పరాజయాన్ని చవిచూసింది. విదర్భ చేతిలో 3వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా... విదర్భ జట్టు 19.2ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి గెలిచింది.








కామెంట్‌లు (0)